రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు

14 Sep, 2016 07:08 IST|Sakshi

విశాఖపట్నం : కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. అల్పపీడనానికి అనుబంధంగా 6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. అలాగే అల్పపీడనం కోస్తాంధ్ర తీరంపైకి చేరుకుందని తెలిపింది. దీంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పింది.

దక్షిణ కోస్తాంధ్రలో గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా బలమైన ఈదురుగాలులు విస్తాయని తెలిపింది. అయితే కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

>
మరిన్ని వార్తలు