మొయినాబాద్‌లో భారీ వర్షం

25 Aug, 2016 21:00 IST|Sakshi
మొయినాబాద్‌లో భారీ వర్షం

- పంటలకు జీవం పోసిందని రైతుల హర్షం

మొయినాబాద్‌:  నెల రోజుల తరువాత వరుణదేవుడు కరుణించాడు. చాలారోజుల తరువాత భారీ వర్షం కురిసి ఎండిపోతున్న  పంటలకు జీవపోసింది. గురువారం మధ్యాహ్నం మండల కేంద్రంతోపాటు పెద్దమంగళారం, చిలుకూరు, అప్పోజీగూడ, చందానగర్‌, రెడ్డిపల్లి, మోత్కుపల్లి, ఎలుకగూడ, కుత్బుద్దీన్‌గూడ, మేడిపల్లి, అమీర్‌గూడ, సురంగల్‌, శ్రీరాంనగర్‌, వెంకటాపూర్‌, నాగిరెడ్డిగూడ తదితర గ్రామాల్లో వర్షం కురిసింది. నెల రోజుల నుంచి వర్షాలు లేక ఎండలు ఎక్కువ కావడంతో చాలా చోట్ల మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, కూరగాయ పంటలు ఎండుముఖం పట్టాయి. పంటలపై ఆశలు వదులుకున్న సమయంలో ఈ వర్షం జీవం పోసిందని  రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మొయినాబాద్‌లో మళ్లీ అదే తీరు..
భారీ వర్షం పడటంతో మొయినాబాద్‌లో హైదరాబాద్‌-బీజాపూర్‌ రహదారిపై భారీగా వరదనీరు నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. మూడు నెలలుగా మండల కేంద్రంలో వర్షం పడినప్పుడల్లా ఈ సమస్య పునరావృతమవుతోంది. మురుగు నీరు వెళ్లేందుకు అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో పాటు రహదారి లోతట్టుగా ఉండటంతో వర్షం నీరంతా నిలిచిపోయి గుంతల మయంగా మారుతోంది. ఇప్పటికే రెండుసార్లు రోడ్డుపై తాత్కాలిక మరమ్మతులు చేశారు. అయినా పరిస్థితి మళ్లీ మొదటి కొచ్చింది. దీనికి తోడు రోడ్డు పక్కనుంచి ఉన్న మురుగుకాలువను మరమ్మతు చేయడానికి వారం రోజుల క్రితం పైకప్పును తొలగించి పెట్టారు. వర్షంనీటితో రోడ్డు, మురుగుకాలువ నిండిపోవడంతో ఎక్కడ రోడ్డు ఉందో, ఎక్కడ మురుగు కాలువ ఉందో తెలియక వాహనదారులు, స్థానికులు అవస్థలు పడుతున్నారు.

శంషాబాద్‌లో.. పట్టణంలో గురువారం మధ్యాహ్నం భారీ ర్షం కురిసింది. జనాలకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగింది. కొన్ని రోజులుగా ఎండల తీవ్రతతో సతమతమవుతున్న వారికి ఈ వర్షం కాస్త ఊరటనిచ్చింది. సుమారు గంటపాటు ఏకధాటిగా వర్షం కురిసింది.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

కూతురి పెళ్లికి అప్పు దొరక్క తండ్రి ఆత్మహత్య

ముంపు..ముప్పు..

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

'పెట్టె' ఫలితమివ్వలే!

తప్పుడు లెక్కలు చెబితే చర్యలు

దోమ కాటు.. కాలుష్యం పోటు

మద్యంపై పోరాటానికి మద్దతు ఇవ్వండి

విద్యాశాఖ నిర్లక్ష్యంతో కుమారుడిని పోగొట్టుకున్నా..

వృద్ధ దివ్యాంగులకు మోటారు వాహనాలివ్వండి..

బ్యారన్‌లు ముంచేశాయి

కిడ్నీలు పనిచేయడం లేదన్నారయ్యా!

అర్హత ఉన్నా పింఛన్‌ ఇవ్వడం లేదు

కుటుంబ పోషణ భారంగా ఉంది

ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడంలేదు:

జగనన్న పేరు పెట్టడం సంతోషంగా ఉంది

వ్యాపారులకు కొమ్ముకాస్తోంది

ముస్లింలను ఆదుకోవాలి

ఫ్లోరైడ్‌ నీరు ప్రాణాలు తీస్తోంది

కేబుల్‌ ఆపరేటర్లకు అన్యాయం చేయొద్దు

అధికారిక దోపిడీ

బ్యాడ్మింటన్‌ ఆడుతూ కానరాని లోకాలకు..

మీటరు వడ్డీతో అల్లాడిపోతున్నాం..!

పశువుల లెక్క పక్కాగా

దాహం తీర్చేదెలా?

ఏమంటాం..ఇష్ట‘పడక’!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మూడోసారి తండ్రి అయిన హీరో!

చానల్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు కూతురు

లిప్ లాక్‌పై స్పందించిన విజయ్‌ దేవరకొండ

తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు!

నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..

‘బిగ్‌బాస్‌’ వివాదంపై స్పందించిన హేమ