వర్షం మిగిల్చిన నష్టం

10 May, 2016 01:51 IST|Sakshi
వర్షం మిగిల్చిన నష్టం

వరుస వర్షాలతో మొయినాబాద్ అతలాకుతలం
పంటనష్టం కన్నా..  ప్రాణ నష్టమే ఎక్కువ
తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులు
సాధారణం కన్నా  వందశాతం ఎక్కువగా వర్షపాతం నమోదు

వర్షాలు మండలాన్ని అతలాకుతలం చే శాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, వడగళ్లతో వర్షం కురవడంతో పిడుగుపాటుకు ఇద్దరు రైతులతో పాటు ఏడు పశువులు మృతి చెందాయి. ప్రహరీ కూలి 30 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. పలు ఇళ్లు, చెట్లు కూలిపోయాయి. చెట్లు కొమ్మలు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మామిడి కాయలు రాలడంతో పాటు పలు కూరగాయలు, పూల పంటలకు నష్టం జరిగింది.  - మొయినాబాద్

 మండలంలో ఈ నెల 2వ తేదీ నుంచి అకాల వర్షాలు మొదలై ఏకదాటిగా కురుస్తూనే ఉన్నాయి. రెండో తేదీన భారీ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. అదేరోజు తోలుకట్ట గ్రామానికి చెందిన రైతు కోమటి నర్సింహ (48)తో పాటు పెద్దమంగళారంలో రెండు ఆవులు, కుత్బుద్దీన్‌గూడలో ఓ గేదె, ఓ ఆవు, రెడ్డిపల్లిలో ఓ ఎద్దు మృతి చెందాయి. సురంగల్‌లో ఈదురుగాలులకు ప్రహరీ కూలి 30 గొర్రెలు మృతి చెందాయి.

ఈదురు గాలులతో పెద్దమంగళారంలో రెండిళ్లు కూలి పోయాయి. 3వ తేదీన ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో పెద్దమంగళారంలో ఒక ఇల్లు, పశువులపాక రేకులు ఎగిరిపోయాయి. 5వ తేదీ సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షానికి కాశీంబౌలిలో ఓ విద్యుత్ స్తంభం విరిగిడ పోయింది. 7వ తేదీన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ పడ డంతో తోలుకట్టలో పిడుగు పడి రైతు చెన్నం భిక్షపతి (45) మృతి చెందాడు. ఎత్‌బార్‌పల్లిలో పిడుగుపాటుకు రెండు గేదెలు మృతి చెందాయి. మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ చెట్టు పడడంతో ప్రహారీ కూలిపోయింది.

 నేలరాలిన మామిడి కాయలు...
మండల వ్యాప్తంగా సుమారు రెండువేల ఎకరాల్లో ఉన్న మామిడి తోటలు తొమ్మి ది రోజులుగా ఈదురుగాలులతో కూడిన వర్షాలకు సగానికిపైగా మామిడి కాయలు నేలరాలిపోయాయి. దీంతో పాటు వడగళ్ల వర్షానికి గ్రామాల్లో కూరగాయ, పూల పంటలకు నష్టం జరిగింది.
♦  ఇప్పటి వరకు 106.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు..
మేనెలలో సాధారణ వర్షపాతం 5 మిల్లీమీటర్లే అయినప్పటికీ ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా మే ఒకటో తేదీ నుంచి 9వ తేదీ వరకు 106.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మరిన్ని వార్తలు