కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీ వర్షాలు

24 Jul, 2015 10:50 IST|Sakshi

విశాఖపట్నం : ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ఇది మరింత బలపడి ఉత్తర బంగాళాఖాతంలో ఆవర్తనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర అంతటా ఓ మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయిని పేర్కొంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 - 50 కిలో మీటర్ల వేగంతో నైరుతి దిశగా బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ చెప్పింది.

>
మరిన్ని వార్తలు