కోస్తా అంతటా విస్తారంగా వర్షాలు

21 Sep, 2016 12:57 IST|Sakshi

విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అది ఉత్తర కోస్తా తీరానికి అనుకుని కేంద్రీకృతమైందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కోస్తా అంతటా విస్తారంగా వర్షాలు కురస్తాయని తెలిపింది. అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 -50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. దీంతో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

మరిన్ని వార్తలు