సీమాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం

17 May, 2016 16:17 IST|Sakshi

విశాఖపట్నం : బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం మంగళవారం వెల్లడించింది. ఇది చెన్నైకి నైరుతి దిశగా 240 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం వివరించింది. రాగాల 24 గంటల్లో చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.

మరిన్ని వార్తలు