సింహాచలంలో పోటెత్తిన భక్తులు

31 Jul, 2015 09:59 IST|Sakshi

విశాఖపట్నం :  సింహాచలంలో కోలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం కోసం శుక్రవారం భక్తులు పోటెత్తారు. స్వామి వారికి ఆలయ అర్చకులు ఆఖరి విడత చందనం సమర్పణ చేశారు. అదికాక ఆషాడ పౌర్ణమి సందర్భంగా సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్ల మేర ప్రదక్షణ (గిరి ప్రదక్షణ) పూర్తి చేసుకున్న భక్తులు అప్పన్న దర్శనం కోసం బారులు తీరారు.

స్వామి వారి దర్శనం కోసం సుమారు 3 లక్షల మంది భక్తులు బారులు తీరారు. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  భక్తులకు పంపిణీ చేస్తున్న లడ్డూలలో పురుగులు ఉండటం చూసి భక్తులు ఆందోళనకు దిగారు. ఆలయ అధికారుల తీవ్ర నిర్లక్ష్యంపై భక్తులు మండిపడుతున్నారు.
 

మరిన్ని వార్తలు