పొంగి పొర్లుతున్న వాగులు

29 Aug, 2016 21:01 IST|Sakshi
పొంగి పొర్లుతున్న వాగులు
* గుంటూరు– మాచర్ల రహదారిలో రాకపోకలు డైవర్షన్‌
వాహనదారులకు సూచనలు చేసిన పోలీసులు
ఆగుతూ సాగుతూ సాగిన వాహనాల రాకపోకలు
 
సత్తెనపల్లి: నియోజకవర్గంలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురవడంతో లోలెవల్‌ చప్టాలు పొంగి పొర్లుతున్నాయి. గుంటూరు – మాచర్ల రహదారిలోని బసవమ్మ వాగు, రాజుపాలెం మండలం అనుపాలెం వద్ద గల లోలెవల్‌ చప్టాలపైగా వర్షపు నీరు మోకాలు లోతు పైనే ప్రవహించడంతో సోమవారం కొద్దిసేపు రాకపోకలను నిలిపి వేశారు. దీంతో ట్రాఫిక్‌ నిలిచిపోయి పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదురవడం, బసవమ్మ వాగు లోలెవల్‌ చప్టా వద్ద ఇద్దరు ద్విచక్ర వాహనదారులు పడి ప్రమాదం నుంచి బయట పడటంతో స్పందించిన పోలీసులు చప్టాల వద్ద కాపలా ఉండి వాహనాల రాక పోకలను గమనిస్తూ సూచనలు చేశారు. పట్టణంలోని బసవమ్మ వాగు లోలెవల్‌చప్టా వద్ద అర్బన్‌ ఎసై ్స నక్కా ప్రకాశరావు, ఏఎసై ్స వీరభాస్కరరావు, ఆరుగురు పోలీసు కానిస్టేబుళ్ళు విధులు నిర్వహించి ఒకవైపు మాత్రమే లోలెవల్‌ చప్టాపైగా వాహనాలు రాక పోకలు సాగించేలా చేశారు.  మాచర్లవైపు వెళ్ళే వాహనాలను పట్టణంలోని నరసరావుపేట రోడ్డులోని చెక్‌పోస్టు వద్ద పోలీసులు డైవర్షన్‌ చేసి వాహనాలను నరసరావుపేట వైపు పంపారు. ఇదిలా ఉంటే ఎక్కువ మంది చప్టాల వద్ద వాహనాలు దిగి చప్టా దాటే వరకు నడిచే ప్రయత్నం చేశారు. పలు కళాశాలలకు వెళ్ళాల్సిన విద్యార్థులకు కాలినడక తప్పలేదు.
>
మరిన్ని వార్తలు