భారజలం, విద్యుదుత్పత్తిలో మంచి ఫలితాలు

16 Aug, 2016 00:31 IST|Sakshi
జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న జీఎం జితేంద్ర శ్రీవాత్సవ
గౌతమీనగర్‌ కాలనీ (అశ్వాపురం) : 2015 – 16 సంవత్సరంలో భారజలం, విద్యుత్‌ ఉత్పత్తిలో మెరుగైన ఫలితాలు సాధించినట్టు భారజల కర్మాగారం జీఎం జితేంద్ర శ్రీవాత్సవ చెప్పారు. గౌతమీనగర్‌ కాలనీలోని స్వరఝరి కళాసంగమం ప్రాంగణంలో సోమవారం స్వాతంత్య్ర దిన వేడుకలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం కూడా ఉత్తమ ఫలితాల సాధనకు అధికారులు, ఉద్యోగులు కృషి చేయాలని కోరారు. సీఐఎస్‌ఎఫ్‌ భద్రతా దళాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కర్మాగారం డీజీఎంలు ఆర్‌కె.గుప్తా, అరుణ్‌ బోస్, సీఐఎస్‌ఎఫ్‌ చీఫ్‌ కమాండెంట్‌ ఎన్‌కె.ఝా, అణుశక్తి కేంద్రీయ  విద్యాలయం ప్రిన్సిపాల్‌ వెంకన్న, వైస్‌ ప్రిన్సిపాల్‌ స్వర్ణరాణి తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు