ప్రాణం కాపాడిన హెల్మెట్‌

30 Aug, 2016 23:56 IST|Sakshi
ప్రాణం కాపాడిన హెల్మెట్‌
  • గాయాలతో ఆస్పత్రిలో చేరిన విద్యార్థి
  • భీమారం : ముందు జాగ్రత్తగా ధరించిన హెల్మెట్‌ ఫిజియోథెరపీ విద్యార్థి ప్రాణాలను కాపాడింది. ఈ సంఘటన నగరంలో 55వ డివిజన్‌ ఎల్లాపురం బ్రిడ్జి వద్ద మంగళవారం జరిగింది. కరీంనగర్‌ జిల్లా భీమదేవరపల్లి  మండలం గట్ల నర్సింగాపురానికి చెందిన గుర్రెపు శ్రీకాంత్‌ అదే జిల్లాలోని  కమలాపురంలో ఉంటూ చదువుకుంటున్నాడు. మంగళవారం ఉదయం అనారోగ్యంతో బాధపడుతున్న తన సమీప బంధువులను చూసేందుకు తన మేనమామతో కలిసి హన్మకొండకు బయల్దేరాడు. వారు చెరొక ద్విచక్ర వాహనం పై వస్తుండగా ఎల్లాపురం బ్రిడ్జి వద్ద హన్మకొండ నుంచి కరీంనగర్‌వైపు వెళ్తున్న స్కార్పియో వాహనం శ్రీకాంత్‌ బైక్‌ను ఢీకొంది. అయితే అతడు హెల్మెట్‌ ధరించి ఉండడంతో అతడి తలకు ఎలాంటి గాయంకాలేదు. హెల్మెట్‌ మా త్రం పగిలింది. ఈ ప్రమాదంలో శ్రీ కాంత్‌ కాళ్లకు బలమైన గాయాల య్యాయి. హెల్మెంట్‌ ధరించకపోతే శ్రీ కాంత్‌ అక్కడికక్కడే మృతిచెంది ఉండేవాడని పోలీసులు అభిపాయ్రపడ్డారు.
     
    ముందు ద్విచక్ర వాహనం, ఆ తర్వాత ఆటో
    ఇదిలా ఉండగా ప్రమాదానికి కారణమైన స్కార్పియో వాహనం శ్రీకాంత్‌ బైక్‌ను ఢీకొట్టిన తర్వాత, ముందు వెళుతున్న ఆటోను బలంగా తగిలింది. దీం తో ఆటో బోల్తాపడడంతో బాహుపేట కు చెందిన ఆటో డ్రైవర్‌ కొడకండ్ల అరుణ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి.
     
    వాహనాన్ని పట్టుకున్న ఇన్‌స్పెక్టర్‌..
    రెండు వాహనాలను ఢీకొని వేగంగా వెళ్తున్న స్కార్పియోను స్థానిక పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ వెంబడించారు. పోలీసుల రాకను గమనించిన డ్రైవర్‌ ఆ వాహనం వదిలి పారిపోయాడు. అన్నాసాగరం సమీపంలో ఎట్టకేలకు వాహనాన్ని పట్టుకున్నారు.  
>
మరిన్ని వార్తలు