చిన్నారిని ఆదుకోరూ..

29 Jul, 2016 19:28 IST|Sakshi
చిన్నారిని ఆదుకోరూ..

శామీర్‌పేట్‌: గొంతు, ఆహారవాహిక శస్ర్త చికిత్సకు ఆర్థిక సహాయం అందించి తమ కుమారుడు భగత్‌ను ఆదుకోవాలని శామీర్‌పేట్‌కు చెందిన ఓ పేద కుటుంబీకులు వేడుకున్నారు. బాధితుడి తల్లిదండ్రులు నవనీత, రమేష్‌లు ‘సాక్షి’కి వివరాలను వెల్లడించారు. శామీర్‌పేట్‌ మండల కేంద్రానికి చెందిన కనకాల నవనీత, రమేష్‌ దంపతులు నిరుపేదలు. రోజువారి కూలీతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. వీరి కుమారుడు కనకాల భగత్‌(5)గత సంవత్సరం డిసెంబర్‌ 25న రసాయన మందు ప్యాకెట్‌ కొరికాడు. దీంతో భగత్ గొంతు పూర్తిగా చెడిపోయింది. ఆపరేషన్‌ కోసం నగరంలోని వివిధ ఆస్పత్రులకు తిప్పిన తల్లిదండ్రులకు ఆర్థిక స్థోమత లేక పోవడంతో ఇంటి వద్దనే భగత్‌కు వైద్యుల సలహామేరకు పాల పాకెట్లతో సాకుతున్నారు. త్వరగా భగత్‌కు ఆపరేషన్‌ చేయించాలని వైద్యులు సూచించారు. ఆపరేషన్‌ చేయాలంటే రూ. సుమారు 6లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలియజేసినట్లు తెలిపారు. పేద కుటుంబానికి చెందిన భగత్ తల్లిదండ్రులు తమ బిడ్డకు ఆపరేషన్‌ చేయించాలంటే ఎవరైనా ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
 

మరిన్ని వార్తలు