దోమల నిర్మూలనకు సహకరించండి

21 Sep, 2016 23:41 IST|Sakshi
– జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌
కర్నూలు(హాస్పిటల్‌):  జిల్లా వ్యాప్తంగా సీజనల్‌ వ్యాధులు విజంభిస్తున్నాయని, దోమల నిర్మూలనకు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ జిల్లా యంత్రాంగాన్ని కోరారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరం నుంచి ‘దోమలపై దండయాత్ర–పరిసరాల పరిశుభ్రత’ అనే అంశంపై మండల స్థాయి అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అన్ని శాఖల పరస్పర సహకారంతో దోమలను నిర్మూలిద్దామని కలెక్టర్‌ అన్నారు. గ్రామాల్లో ఇంటింటా తిరిగి అవగాహన కల్పించడంతోపాటు జ్వరపీడితులకు రక్తపరీక్షలు చేసి మందులు ఇవ్వాలన్నారు. ఇందుకు  పెన్షనర్లు, మహిళా సంఘాలు, రైతుల సహకారం తీసుకోవాలన్నారు. ఈ నెల 24న గ్రామ, పంచాయతీ, మండల స్థాయిలో ఆయా స్థాయి అధికారులు దోమల నిర్మూలనపై ర్యాలీ నిర్వహించాలన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులను దోమల నిర్మూలనకు ఖర్చు చేయాలని ఆదేశించారు. జాయింట్‌ కలెక్టర్‌–2 రామస్వామి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ యు. స్వరాజ్యలక్ష్మి, డీపీవో ఆనంద్‌నాయక్, జెడ్పీ సీఈవో ఈశ్వర్, డీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి, డీఆర్‌డీఏ, డ్వామా, మెప్మా  పీడీలు రామకష్ణ, డ్వామా పుల్లారెడ్డి, రామాంజనేయులు, నగర పాలక సంస్థ కమిషనర్‌ రవీంద్రబాబు, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ మోక్షేశ్వరుడు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు