ఘనంగా వసంతోత్సవం

2 Mar, 2017 22:32 IST|Sakshi

అమరాపురం : మండలంలోని హేమావతిలో వెలసిన హెంజేరు సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం వసంతోత్సవం నిర్వహించారు. ఉదయం సుప్రభాతసేవ, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం అనంతరం వివిధ రకాల పూలమాలలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి మహా మంగళహారతి పట్టారు. తరువాత సిద్దలింగేశ్వరస్వామి వసంతం సేవ నిర్వహించారు. అనంతరం స్వామి వారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. రూ.2.69 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ శ్రీనివాసులు తెలిపారు.

మరిన్ని వార్తలు