హీరోతో పాటు గుర్తింపు ఉన్న క్యారెక్టర్లు చేస్తున్నా..

2 Feb, 2017 23:06 IST|Sakshi
  • హీరో శ్రీకాంత్‌
  • కొత్తపేట :
    హీరోగానే కాక గుర్తింపు ఉన్న క్యారెక్టర్‌ పాత్రలను కూడా పోషిస్తున్నట్టు ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ చెప్పారు. శ్రీకాంత్, తన సతీమణి ఊహతో గురువారం కొత్తపేట మండలం మందపల్లి ఉమా మందేశ్వర (శనీశ్వర) స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. 
    విజయ చరిస్‌ విజ¯ŒS బ్యానర్‌పై విజయ్‌ నిర్మించిన ‘రారా’ అనే హారర్‌ మూవీలో, మరో బ్యానర్‌పై ‘నాటుకోడి’ చిత్రంలో నటించానని, ఆ రెండు సినిమాలు త్వరలో విడుదల కానున్నాయని తెలిపారు. గతంలో ‘విరోధి’ పేరుతో సొంతంగా నిర్మించిన సినిమా ఇండియ¯ŒS పనోరమ ఫిలిం ఫెస్టివల్‌ గుర్తింపు పొందిందన్నారు. కొంతకాలం సొంత సినిమాల నిర్మాణం, దర్శకత్వం వహించే ఆలోచన లేవన్నారు. ‘నిర్మలా కాన్వెంట్‌’తో సినీ అరంగేట్రం చేసిన తన తనయుడు రోష¯ŒS ప్రస్తుతం చదువుకుంటున్నాడని తెలిపారు.
    తన సతీమణి ఊహకు మరలా సినీరంగంలోకి వచ్చే ఉద్దేశం లేదని, గృహిణిగానే కొనసాగుతుందని చెప్పారు. శ్రీకాంత్‌ దంపతులు శనీశ్వరునికి ప్రత్యేక పూజలు, తైలాభిషేకం నిర్వహించారు. ప్రధార్చకులు అయిలూరి శ్రీరామమూర్తి,సత్యనారాయణమూర్తి వారికి ఆశీర్వచనాలు పలకగా దేవస్థానం చైర్మ¯ŒS బండారు సూర్యనారాయణమూర్తి  ఆలయ సాంప్రదాయం ప్రకారం గౌరవ సత్కారం చేశారు.
     
మరిన్ని వార్తలు