రోడ్డుపై టీ లాయర్ల భోజనాలు

17 Jul, 2015 16:43 IST|Sakshi

హైదరాబాద్: హైకోర్టు విభజన కోరుతూ తెలంగాణ న్యాయవాదులు వినూత్న నిరసన చేపట్టారు. హైకోర్టు ఎదుట రోడ్డుపై బైఠాయించి సామూహిక భోజనాల చేశారు. ఈ సందర్భంగా హైకోర్టును వెంటనే విభజించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. తమ డిమాండ్ పరిగణనలోకి తీసుకోకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించారు. హైకోర్టు విభజన పూర్తి చేయకుంటే పార్లమెంటును ముట్టడిస్తామని తెలంగాణ న్యాయవాదులు డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు