బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత

26 Sep, 2016 18:54 IST|Sakshi
డీఐజీ ప్రభాకరరావు
– హైటెక్‌ టెక్నాలజీతో దొంగలకు చెక్‌
– 3వేల మందితో బందోబస్తు
– గరుడ సేవకు అదనంగా 1000 మంది
– 150 మందితో పోలీస్‌ సేవాదళ్‌æ
– తిరునగరంపై డ్రోన్‌ కెమెరా కన్ను
–  డీఐజీ ప్రభాకరరావు
 
తిరుపతి క్రై ం:
 శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. హైటెక్‌ టెక్నాలజీతో దొంగలను నియంత్రించేందుకు ప్రత్యేక యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఏర్పాట్లు, భద్రతపై అనంతపురం రేంజ్‌ డీఐజీ ప్రభాకరరావు ఏమన్నారంటే.. ఆయన మాటాల్లోనే..
 శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పేజ్‌–1 క్రింద 3వేల మందితో గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నాం. గరుడ సేవ రోజున పేజ్‌–2 కింద అదనంగా మరో 1000 మంది సిబ్బందితో బందోబస్తును నిర్వహించనున్నాం. 
– వచ్చే నెల 8వ తేదీన పెరటాసి నెల 4వ వారం, దసరా సెలవులకు, ఈసారి గరుడసేవకు, పెరటాసి 5వ శనివారానికి సుమారు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు జనసందోహం ఉంటుందని అంచనా వేశాం. 
–ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. గరుడసేవ రోజున ద్విచక్రవాహనాలను తిరుమలకు అనుమతించం. తిరుపతిలోనే పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేశాం.
–తిరుమలలో ప్రై వేట్‌ వాహనాలను పార్కింగ్‌ చేసుకునేందుకు ప్రస్తుతం ఉన్న బాలాజీ బస్టాండ్‌లో ఏర్పాటు చేశాం.
– ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా పీఎస్‌ఈ–3, రాంబగీచా వద్ద ఆగాలి. 
–శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్‌ 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. అందుకోసం తిరుమలలో 7 మొబైల్‌ సెంటర్లను ఏర్పాటు చేశాం. లేపాక్షి, ఆర్టీసీ బస్టాండ్, రాంబగీచ బస్టాండ్, ఎస్వీ మ్యూజియం, గోకులం, పాపవినాసం, అలిపిరి చెక్‌పోస్టు, మామండూరు ఔట్‌పోస్టు వద్ద ఈసెంటర్లు ఉన్నాయి.
– అలాగే 14 మొబైల్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేశాం. అందులో 6 మొబైల్‌ క్లినిక్‌లు ఘాట్‌రోడ్డులో తిరుగుతూ ఉంటాయి. అక్కడ నిలిచిపోయిన వాహనాలను మరమ్మతులు చేసి పంపుతుంటాయి. మిగతావన్నీ తిరుమల పరిసరప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయి.
– తిరుపతిలో రైల్వేస్టేషన్, బస్టాండ్, అలిపిరి చెక్‌ పాయింట్, అలిపిరి లింక్‌ బస్టాండ్‌ వద్ద హెల్ప్‌సెంటర్లను ఏర్పాటు చేశాం. ఇక్కడ ప్రజలకు కావాల్సిన సమాచారం ఇస్తారు. అంతేకాకుండా ఇందులో ఓ ఎసై ్స స్థాయి అధికారి ఉంటారు. ఏదైనా సమస్య వస్తే అక్కడిక్కడే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారు.
– దొంగలను నియంత్రించడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. క్రై ం ఏఎస్పీ ఆధ్వర్యంలో ఆ సిబ్బంది మొత్తం పని చేస్తారు. వీరి వద్ద 50 ఎఫ్‌ఐఎన్‌ఎస్‌ (ఫింగర్‌ ప్రింట్‌ ఐడెంటిఫికేషన్‌ అండ్‌ సర్చ్‌) మిషన్లు ఉంటాయి. ఇది అంతా హైటెక్‌ టెక్నాలజీ దొంగ దొరికిన వెంటనే ఫింగర్‌ ప్రింట్‌ తీసుకుంటాం. అందులో 6 లక్షల వేలిముద్రలు ఉన్నాయి. వాడు పాతనేరస్తుడైతే స్పాట్‌లోనే వాడి చిట్టా బయటకు వస్తుంది. జీరో శాతం క్రై ంలు నమోదైయేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
–పుష్కరాల తరహాలో మొదటి సారిగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 150 మందితో పోలీస్‌ సేవాదళ్‌ను ఏర్పాటు చేశాం. వీరు కేవలం వృద్ధులకు, మహిళలు, చిన్నపిల్లలకు ప్రత్యేక ప్రతిభావంతులకు వాహన సేవలను చూపించేందుకు సహకరిస్తారు. వీరు కేవలం ఈ పనులకే కేటాయించాం.
–తిరుపతిలో ఉన్న వసతి గృహాల్లో కూడా బ్రహ్మోత్సవాల వరకు సిబ్బందిని ఏర్పాటు చేస్తాం.
– తిరుమలలో ఇప్పటికే 400 పైగా కెమెరాలు ఉన్నాయి. వీటిని పెంచి రాంబగీచ వద్ద ఓ పోలీస్‌ కంట్రోల్‌ను ఏర్పాటు చేస్తాం.
– 5 సంవత్సరాల లోపు చిన్నారులకు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద, తిరుమలకు వెళ్లే 2వైపులా ఉన్న నడకదారుల భక్తులకు ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కంకణం కడుతాం. దానిపై వారి కుటుంబ సభ్యుల ఫోన్‌ నంబర్‌ రాస్తాం. దీనిద్వారా ఎవరైనా తప్పిపోయినా సకాలంలో తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. దీన్ని అమలు చేసేందుకు చూస్తున్నాం.
– నగరంపై ఒక డ్రోన్‌ కెమెరాతో నిఘా ఏర్పాటు చేస్తాం. ముందుగా ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా కమాండెంట్‌ కంట్రోల్‌లో క్షుణ్ణంగా పరిశీలిస్తాం. విజయవంతంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.
– గతంలో 2011లో ఒక బ్రహ్మోత్సవం, 2012లో ఒక బ్రహ్మోత్సవం అర్బన్‌ జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉంది. తిరిగి ఇదే జోన్‌కు డీఐజీగా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 
 
 
 
 
>
మరిన్ని వార్తలు