తెరపైకి హై సెక్యూరిటీ

18 Dec, 2016 02:55 IST|Sakshi

తిరుపతి క్రైం: అర్థంకాని అక్షరాలు, సినీ హీరోల బొమ్మలు, రాజకీయ పార్టీల గుర్తులు, క్షుణ్ణంగా చూసినా గుర్తుపట్టలేని విధంగా వాహనాలకు నంబర్‌ బోర్డులు ఏర్పాటుచేసుకుంటున్నారు. వీటిని దుండగులు సులభంగా మార్చేసి చోరీలకు పాల్పడుతున్నారు. మరికొం దరు ఒకే బోర్డును రెండు మూడు వాహనాలకు అమర్చి ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతున్నారు. వీటికి చెక్‌ పెట్టడానికి హైసెక్యూరిటీ బోర్డు విధానాన్ని తీసుకురావాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశిం చింది. తొలిదశలో కొత్త వాహనాలకు, మలి దశలో పాత వాహనాలకు ఏర్పాటు చేయాలని సూచిం చిం ది. కోర్టు ఉత్తర్వులకనుగుణంగా ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. జిల్లాలో మార్చి 2014 నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ పూర్తయిన వాహనాల కు హైసెక్యూరిటీ నంబర్‌ బోర్డుల ప్రక్రియను ప్రారంభించింది. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారి పై కొరడా ఘుళిపించాలని కూడా నిర్ణయించింది. ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో హైసెక్యూరిటీ బోర్డుల ప్రక్రియ ముందుకు సాగడం లేదు.

2001లోనే ప్రతిపాదనలు
దేశంలో హైసెక్యూరిటీ విధానం అమలుకు 2001లో ప్రతిపాదనలు పెట్టారు. దేశరాజధాని ఢిల్లీలో 2003 లో ఈ విధానం అమలులోకి వచ్చింది. మిగిలిన రాష్ట్రాల్లో కూడా 2013 డిసెంబర్‌ 11 తర్వాత కొత్త రిజిస్ట్రేషన్‌ అయిన అన్ని వాహనాలకు బోర్డులు తప్పకుండా అమర్చాల్సిందేనని ఉత్తర్వులు వెలువడ్డాయి.

పాత వాహనాలకు వర్తింపు
అన్ని రకాల పాత వాహనాలకు హైసెక్యూరిటీ విధానాన్ని వర్తింపచేయాలని కోర్టు ఆదేశించింది. కేంద్ర మోటారు వాహనాల చట్టం 1989లోని రూల్‌ 50 ప్రకారం ప్రతి వాహనానికీ విధిగా హైసెక్యూరిటీ బోర్డు అమర్చాలి. ఇటీవల రవాణా కమిషనర్‌ పాత వాహనాలకు కూడా బోర్డులు అమర్చుకోవాలని ప్రకటించారు. ఆగస్టు 31 వరకు గడువు ఇచ్చారు. ఆచరణలో అది సాధ్యం కాలేదు. బోర్డుల పట్ల వాహనదారులు ఆసక్తి చూపలేదు. ప్రభుత్వ పరంగా కట్టుదిట్టమైన ఆదేశాలు లేకపోవడంతోనే పూర్తిస్థాయిలో అమలుకాలేదని అ«ధికారులు చెబుతున్నారు.

ఉపయోగాలు
ట్రాఫిక్‌ ఉల్లంఘనకు పాల్పడినా, నిబంధనలు అతిక్రమించినా కెమెరాలు బంధిస్తాయన్న అవగాహన వాహనదారుల్లో ఉంటుంది.
వాహనాల వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు. దేశవ్యాప్తంగా యూనిక్‌ కోడ్‌తో వాహన వివరాలను రాబట్టవచ్చు.
వాహనాల చోరీలు అరికట్టవచ్చు. యూనిక్‌ కోడ్‌ సాయంతో వాహనం ఎటువైపు ప్రయాణించిందో కూడా తెలుసుకోవచ్చు.
విచ్చల విడిగా బోర్డుల తయారీని నియంత్రించవచ్చు
అన్ని తరహా వాహనాలు ఒకే విధంగా బోర్డులు కలిగి ఉంటాయి.
పటిష్టమైన లాకింగ్‌ సిస్టమ్‌తో బోర్డులు అమర్చడం, మళ్లీ వాటిని తీసేందుకు అవకాశం లేకపోవడం వల్ల భద్రత ఉంటుంది.

అమలులో లోపాలు
మార్కెట్‌లో అసలుతో పోటీగా నకిలీ బోర్డులు చెలామణి అవుతున్నాయి. పోల్చడం కష్టంగా మారింది.
బోర్డుల్లో హోలోగ్రామ్, యూనిక్‌ కోడ్‌తో దూ రం నుంచి వాహనాలను పసిగట్టే చిప్‌ అమర్చలేదు.
∙హైసెక్యూరిటీ బోర్డులు అమర్చని పక్షంలో అపరాధ రుసుం, చట్టపరమైన చర్యలపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడం.
ఇప్పటికే సరఫరా అయిన బోర్డుల్లో నాణ్యత లోపించడం, అక్షరాలు సరిగా కనిపించకపోవడంతో వాహనదారుల నుంచి అసంతప్తి వ్యక్తం కావడం.

మరిన్ని వార్తలు