గుంటూరు ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తం

27 Aug, 2015 12:09 IST|Sakshi
గుంటూరు ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తం

గుంటూరు : గుంటూరు నగరంలోని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించేందుకు వచ్చిన మంత్రులను కలిసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాన్ని పోలీసు అడ్డుకున్నారు. దాంతో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూలో నవజాత శిశువును ఎలుకలు కొరికాయి. దాంతో తీవ్ర గాయాలపాలైన శిశువు మరణించింది. స

ఈ నేపథ్యంలో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, నారాయణ, ఎంపీ గల్లా జయదేవ్లు ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ విషయం తెలిసిన వైఎస్ఆర్ సీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, వంగవీటి రాధ, మేరుగ నాగార్జునలు ఆసుపత్రికి చేరుకుని... ఆసుపత్రి దుస్థితి వివరించేందుకు ప్రయత్నించారు. అనుమతి లేదంటూ వారిని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు, వైఎస్ఆర్ సీపీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

మరిన్ని వార్తలు