జైలులో ఉన్నత విద్య

30 Mar, 2016 04:31 IST|Sakshi
జైలులో ఉన్నత విద్య

పోచమ్మమైదాన్: జైలు శిక్ష అనుభవిస్తూ డిగ్రీ పట్టా సాధించారు పాపినేని సుధీర్‌కుమార్, నాగమణి దంపతులు. వీరు ప్రభుత్వంపెట్టిన క్షమాభిక్ష ద్వారా వరంగల్ కేంద్ర కారాగారం నుంచి మంగళవారం విడుదలయ్యా రు. వీరిది ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగలవంచ. వీరిద్దరు పదో తరగతి వరకు చదువుకున్నారు.

వీరి భూమిని ఆక్రమిస్తుండటంతో జరిగిన గొడవలో ఒకరు చనిపోయారు. దీంతో వీరిద్దరికి జైలు శిక్ష పడింది. శిక్షా కాలంలో సమయం వృథా చేయవద్దని నిర్ణయానికి వచ్చారు. కేంద్ర కారాగారంలో చదువుకునే అవకాశం ఉండటంతో భార్యాభర్తలు ఇద్దరూ బీఏలో ప్రవేశం పొందారు. ఇద్దరూ డిగ్రీ పాస్ అయ్యారు. ఎంఏ సోషియాలజీ సైతం ఇటీవల పూర్తి చేశారు. వీరిద్దరు ఇప్పటికే డిగ్రీ పట్టా పొందగా.. మరో 10 రోజుల్లో పీజీ పట్టాను సైతం పొందనున్నారు. కేంద్ర కారాగారంలో శిక్షను అనుభవిస్త్తూనే చదువుపై ఉన్న పట్టుదలతో ఇద్దరు పీజీలు పూర్తి చేశారు.

మరిన్ని వార్తలు