చేనేత అభివృద్ధికి అధిక ప్రాధాన్యం

27 Sep, 2016 21:33 IST|Sakshi
చేనేత అభివృద్ధికి అధిక ప్రాధాన్యం
భూదాన్‌పోచంపల్లి : చేనేత పరిశ్రమ అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని చేనేత డైహౌజ్‌లో పోచంపల్లి చేనేత సహకార సంఘం 61వ వార్షిక, 58వ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం చేనేతను పరిశ్రమల శాఖలో కలపకూడదని నిర్ణయానికి వచ్చిందన్నారు. అలాగే చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు పెంచడానికి హ్యాండ్లూమ్‌ పాలసీని తీసుకొస్తుందని వెల్లడించారు. బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ చేనేత పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. సహకార సంఘం అధ్యక్షుడు భారత వాసుదేవ్‌ మాట్లాడుతూ త్రిఫ్ట్, ఎఫ్‌డీల రూపంలో కాకుండా నగదును ఇప్పించాలని అధికారులను కోరారు. నష్టాల్లో ఉన్న సంఘాన్ని రూ. 8లక్షల, 52వేల లాభాలతో అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో కొంగరి భాస్కర్, సర్పంచ్‌ తడక లతావెంకటేశం, సీత చంద్రయ్య, చిట్టిపోలు శ్రీనివాస్, సూరపల్లి శ్రీనివాస్, రాంచంద్రం, బుచ్చమ్మ, అంకం మురళి, సీత చక్రపాణి, గంజి అంజయ్య, గుండు వెంకటేశం, భారత భారతమ్మ, మేనేజర్‌ చిలువేరు గోవర్ధన్, విష్ణుచక్రం, తడక రమేశ్, భారత లవకుమార్, గోలి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు