హైందవ ధర్మాన్ని రక్షించాలి

12 Dec, 2016 15:18 IST|Sakshi
హైందవ ధర్మాన్ని రక్షించాలి
పుష్పగిరి స్వామీజీ శ్రీ విద్యాశంకర భారతీస్వామి
కాకినాడ కల్చరల్‌ :  హైందవ ధర్మాన్ని పరిరక్షించాలని పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతీస్వామి పిలుపునిచ్చారు. కాకినాడలోని జిల్లా పురోహిత సంఘం అధ్యక్షుడు ఆకెళ్ళ మురళీకృష్ణ స్వగృహంలో స్వామీజీకి వేదమంత్ర పూర్వక పూర్ణకుంభంతో శనివారం స్వాగతం పలికారు. దేశంలో జరగుతున్న అన్యమత ప్రచారాల వల్ల హిందూమతం సంక్షోభంలో పడిందన్నారు. అన్యమత ప్రచారాలను సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ధర్మ సంస్థాపన కోసం తాము దేశ పర్యటన చేస్తున్నామన్నారు. దేవాదాయశాఖలో జరుగుతున్న హైందవ విరుద్ధ కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. భగవంతుని బోధనలను అనుసరిస్తే మానవ జీవితానికి సార్ధకత చేకూరుతుందన్నారు. కార్తికమాసం సందర్భంగా శ్రీ చక్రార్చన, మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలను నిర్వహించి భక్తులను అనుగ్రహిస్తున్నామన్నారు. కార్తికమాసం  పుణ్యఫలం గురించి, ప్రత్యేకత గురించి భక్తులకు స్వామీజీ వివరించారు. కార్యక్రమంలో వై.పద్మనాభం, బ్రాహ్మణ సంఘం కార్యదర్శి వాడ్రేవు సుబ్మహ్మణ్యం, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి అజ్జరపు సత్యనారాయణ, చల్లా నిరంజ¯ŒS  పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు