ఇంటి వద్ద కూర్చోబెట్టి.. హైటెక్‌ మోసం

11 Sep, 2016 23:23 IST|Sakshi
ఇంటి వద్ద కూర్చోబెట్టి.. హైటెక్‌ మోసం
నెలకు రూ.30 వేలు సంపాదించవచ్చంటూ ఆశ పెట్టిన సంస్థ ∙బోర్డు తిప్పేసిన ‘ఆపిల్‌ ఔట్‌ సోర్సింగ్‌’!
కంబాలచెరువు (రాజమõß ంద్రవరం) :
‘ఎలాంటి ఖర్చు లేకుండా ఇంటి వద్దే ఉంటూ నెలకు రూ.30 వేలు సంపాదించవచ్చు..’ ఇలాంటి ప్రకటన ఎవరికైనా ఇట్టే ఆకట్టుకుంటోంది. అలాగే ఆశపడిన అనేక మంది సొమ్ము పోగొట్టుకుని, ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. ఇంటి వద్ద కంప్యూటర్‌ ద్వారా వారు చెప్పినట్టు చేస్తే.. ఒక్క రూపాయి రాకపోగా, ఇంటర్నెట్‌ కనెక్షన్‌కు తడిసిమోపెడైంది. రాజమహేంద్రవరంలో ‘ఆపిల్‌ ఔట్‌సోర్సింగ్‌’ సంస్థ నిర్వాకంతో బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో శ్రీవల్లి అనే యువతి ఓ ఆకర్షిణీయమైన ప్రకటన చూసింది. ఇంటి వద్ద నుంచే నెలకు వేలకు వేల రూపాయలు సంపాదించవచ్చనేది దాని సారాంశం. ఆమె అందులో ఫోన్‌ నంబర్‌కు ఫోన్‌ చేసింది. ఓ వ్యక్తి ఆమెతో మాట్లాడి, రాజమహేంద్రవరంలోని దానవాయిపేటలో ఉన్న ఆపిల్‌ ఔట్‌సోర్సింగ్‌ కార్యాలయానికి వెళ్లమన్నాడు. అక్కడ నాయుడు అనే వ్యక్తి ఆమెను కలిశాడు. తమ వద్ద నాలుగు రకాల ప్లాన్లు ఉన్నాయని, ఎస్‌ఎంఎస్‌లు చేయడం, రోజుకు 500 వీడియోలు వీక్షించడం, రోజంతా నెట్‌ ఆ¯Œæలో ఉంచడం వంటి ప్లాన్లు చెప్పారు. వాటికి రూ.5,500 నుంచి రూ.10 వేలు చెల్లించాల్సి ఉందన్నాడు. ముందుగా ఫీజు చెల్లించి రిజిస్టర్‌ చేసుకోవాలని పేర్కొన్నాడు.
నగలు తాకట్టు పెట్టి..
మరుసటి రోజు శ్రీవల్లి తన వద్ద ఉన్న బంగారు చెవిదిద్దులు తాకట్టుపెట్టి, రూ.5,500 చెల్లించి, ఆ సంస్థలో రిజిస్టర్‌ అయింది. ఆమెకు ధ్రువపత్రంతో పాటు కంప్యూటర్‌ ఐడీ ఇచ్చారు. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కోసం ఆమె మరో రూ.వెయ్యి అప్పు చేయాల్సి వచ్చింది. రోజుకు 500 వీడియోలు చూసే ప్లాన్‌ చేపట్టి, కొద్దిరోజులకు అస్వస్థతకు గురైంది. రెండు నెలలు గడిచినా.. ఆమెకు ఒక్క పైసా కూడా రాలేదు. దీంతో సంస్థ కార్యాలయానికి వెళితే, ఆపిల్‌ ఔట్‌సోర్సింగ్‌ షిఫ్ట్‌ టు హైదరాబాద్‌ అనే బోర్డు కనిపించడంతో అవాక్కైంది. దీనిపై ఆరాతీస్తే.. నాయుడు అనే వ్యక్తి ఆఫీసు మార్చి వెళ్లిపోయాడని తెలిసింది. అదే సమయంలో మరికొందరు బాధితులు అక్కడకు చేరుకుని, విషయం తెలిసి బావురుమన్నారు. ఈ విషయాన్ని ‘సాక్షి’కి వివరించారు. అక్కడున్న సిబ్బందిని ప్రశ్నించగా, పొంతన లేని సమాధానాలు చెప్పారు. నాయుడు అనే వ్యక్తి తమకూ జీతాలు ఇవ్వలేదని తెలిపారు. ప్రస్తుతం ఆఫీసు నిర్వహిస్తున్న రాజు అనే వ్యక్తి.. తాను ఎనిమిది ఐడీలకు సొమ్ము చెల్లించానని పేర్కొన్నాడు.
బాధితులు ఫిర్యాదు చేస్తే చర్యలు
సంస్థ బోర్డు తిప్పేయడంపై అర్బన్‌జిల్లా ఎస్పీ రాజకుమారిని వివరణ కోరగా, ఈ సంఘటనపై ఆరా తీస్తామని చెప్పారు. బాధితులు ఒన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చే స్తే, చర్యలు తీసుకుంటామన్నారు.
 
మరిన్ని వార్తలు