శ్రీశైలం టెయిల్ పాండ్ డ్యాంకు భారీ గండి

20 Nov, 2015 22:08 IST|Sakshi
శ్రీశైలం టెయిల్ పాండ్ డ్యాంకు భారీ గండి

శ్రీశైలం: తెలంగాణా జెన్‌కో ఆధ్వర్యంలో సుమారు రూ.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న శ్రీశైలం టెయిల్‌పాండ్ కాంక్రీట్ డ్యాంకు గండిపడింది. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన జరుగుతుండడంతో కొద్దిపాటి ప్రవాహానికి నిర్మాణంలో ఉన్న డ్యాం మధ్యభాగంలో సుమారు 30 అడుగుల వెడల్పు, ఎత్తులో కాంక్రీట్ డ్యాం కొట్టుకుపోయింది. నిల్వ ఉన్న నీరు దిగువ ప్రాంతానికి విడుదలవుతుంది. గురువారం రాత్రి 9గంటల సమయంలో కాంక్రీట్‌డ్యాంకు గండిపడిందని అక్కడి మత్సకారులు అంటున్నారు.

శ్రీశైల జలాశయానికి 12 కి.మీ దూరంలో తెలంగాణా- ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలను కలుపుకుని టైల్‌పాండ్ డ్యాంను నిర్మిస్తున్నారు. నీటిలో వేయవల్సిన ట్రీమి కాంక్రీట్‌లో నాణ్యత లోపించడం వల్లే కాంక్రీట్ డ్యాంకు గండిపడినట్లు ఇంజనీర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే పూర్తి వివరాలను వెల్లడించేందుకు అక్కడి ఇంజనీర్లు నిరాకరిస్తున్నారు. అకస్మాత్తుగా కాంక్రీట్‌డ్యాంకు గండిపడడంతో మత్సకారుల వలలు, బుట్టలు, ప్రమాదానికి గురై దెబ్బతిన్నట్లు అక్కడి మత్సకారులు తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ప్రభుత్వ ధనం వృథా కాకుండా చర్యలు చేపట్టాలని ఆ ప్రాంతంలోని ప్రజలు అంటున్నారు.

మరిన్ని వార్తలు