వల్లభనేని తప్పు చేస్తే శిక్ష తప్పదు: చినరాజప్ప

15 Feb, 2016 11:19 IST|Sakshi
వల్లభనేని తప్పు చేస్తే శిక్ష తప్పదు: చినరాజప్ప
రాజమండ్రి: వల్లభనేని వంశి అరెస్ట్ విషయంలో చట్టం తన పని తాను చేసుకెళ్తుందని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కేసు దర్యాప్తులో ఉందని విచారణలో తప్పు చేసినట్లు తేలితే శిక్ష తప్పదని ఆయన అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్లో సోమవారం నుంచి ప్రారంభమైన రాష్ర్ట వ్యాప్త జైళ్ల శాఖ పునరుశ్ఛరణ తరగతులకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తుని ఘటనపై సీఐడీ విచారణ జరుగుతోందని దోషులను కఠినంగా శిక్షంచడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. 
 
కృష్ణా జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ శివారు రామవరప్పాడులో ఇన్నర్ రింగ్‌రోడ్డు పనులు నిమిత్తం రైవస్ కాల్వకట్టపై ఇళ్లు తొలగించాలంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయడం, అందుకు నిరసనగా స్థానికులు రహదారిపై రాస్తారోకో చేశారు. అయితే ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని, ప్రజలను రెచ్చగొట్టారని, జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి వాహనదారులకు ఇబ్బంది కలిగించారనే అభియోగాలతో వివిధ సెక్షన్ల కింద ఎమ్మెల్యేతోపాటు 200 మందిపై కేసు నమోదు చేశారు
మరిన్ని వార్తలు