ఎవరినీ వదలం: హోం మంత్రి

13 Dec, 2015 16:16 IST|Sakshi

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కాల్ మనీ వ్యవహారం పై ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పందించారు. ఈ వ్యావహారంతో సంబంధం ఉన్న ఎవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు. కాల్ మనీ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. కాల్ మనీ వంటి వ్యవహారాలు.. రాష్ట్రంలో మరెక్కడైనా ఉన్నాయేమో పరిశీలించాల్సిందిగా పోలీసు శాఖను అప్రమత్తం చేసినట్లు వివరించారు.


కాగా.. కాల్మనీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన బ్యాంకాక్ నుండి వేరే దేశానికి పరారయినట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు చెన్నుపాటి శ్రీనుతో పాటు డీఈ సత్యానంద కూడా పరారీలో ఉన్నారు. 

మరిన్ని వార్తలు