క్షతగాత్రులను కాపాడితే సన్మానం

22 Mar, 2017 00:08 IST|Sakshi
క్షతగాత్రులను కాపాడితే సన్మానం
కర్నూలు (హాస్పిటల్‌): రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని రక్షిస్తే వారిని జిల్లా పోలీసులచే సన్మానిస్తామని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ ప్రకటించారు. మంగళవారం శాంతిభద్రతల దృష్ట్యా రహదారి భద్రతపై కమాండ్‌ కంట్రోల్‌ రూములో జిల్లా ఎస్పీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. జాతీయ రహదారులపై రోడ్డు భద్రతా ర్యాలీలు నిర్వహించాలన్నారు.
 
డ్రైవర్లకు కంటికి సంబంధించిన మెడికల్‌ చెకప్‌లు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏదైనా మానవ తప్పిదాలతో రోడ్డు ప్రమాదాలకు గురైన బాధితులు ఆస్పత్రిని ఆశ్రయిస్తే వారిని కేసుల పరమైన విచారణలు చేయకుండా ఆస్పత్రిలో త్వరగా చేర్చుకొని చికిత్స అందించాలని ఆస్పత్రి యాజమాన్యాలను కోరారు. ఆస్పత్రి సిబ్బంది చికిత్స అందించకపోతే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ ఐ.వెంకటేష్, ఓఎస్‌డీ రవిప్రకాష్, డీఎస్పీలు డీవీ రమణమూర్తి, జె.బాబుప్రసాద్, మురళీధర్, అబ్దుల్‌ సలాం, రంగయ్య, సీఐలు సుబ్రమణ్యం, ఆదిలక్ష్మి, ఆర్‌ఐలు రామకృష్ణ, జార్జ్, రంగముని, ఆర్‌ఎస్‌ఐ, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.     
 
>
మరిన్ని వార్తలు