కలెక్టర్‌ దృష్టికి ఆస్పత్రి సమస్యలు

6 Aug, 2016 00:02 IST|Sakshi
సవూవేశంలో వూట్లాడుతున్న ఎంపీపీ

వి.కోట: స్థానిక సావూజిక ఆరోగ్య కేంద్రంలో ఇబ్బందులను జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకుపోవాలని ఆసుపత్రి అభివృద్ధి అడ్‌హాక్‌ కమిటీ తీర్మానించింది. శుక్రవారం జరిగిన కమిటీ సవూవేశంలో ఎంపీపీ సులోచన, ఎంపీడీవో రమేష్‌ అధ్యక్షతన పలు అంశాలను సమీక్షించారు. నాల్గవ తరగతి ఉద్యోగుల ఖాళీలు భర్తీ కాకపోవడంతో ఆసుపత్రిలో తీవ్ర ఇబ్బంది ఉందన్నారు. నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నావుని వైద్యాధికారి కిజియారాణి వివరించారు. కమిటీ ఏర్పాటు చేయకపోవడంతో హెచ్‌డీఎస్‌ నిధులు రూ. ఐదు లక్షలు వినియోగించే పరిస్థితి లేదన్నారు. ఆస్పత్రిఆవరణలో పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ సూచించారు. వైద్యుల కొరత తీర్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని తీర్మానించారు. కార్యక్రవుంలో ఎస్పీహెచ్‌వో లలిత, సర్పంచ్‌ రావుకృష్ణప్ప, ఈవో శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు. సవూవేశం అనంతరం డీసీహెచ్‌ఎస్‌ సరళవ్ము ఆసుపత్రిని తనిఖీ చేశారు. ని«ధుల వుంజూరుపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతావుని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు