అద్దె భవనాల్లో ఆసుపత్రులు

21 Sep, 2016 19:24 IST|Sakshi
మొలంగూర్‌లో అద్దె ఇంట్లో నడుస్తున్న ఆయుర్వేద ఆసుపత్రి
  • 50 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఆయుర్వేదం
  • పక్కాభవనం నిర్మించాలని కోరుతున్న ప్రజలు
  • పట్టించుకోని పాలకులు
  • శంకరపట్నం: గ్రామీణ ప్రాంత ప్రజారోగ్యం పడకేసింది. పంటపొలాల సస్యరక్షణ కోసం పలు రకాల పనులు చేపడుతున్న క్రమంలో రైతులు అనారోగ్యం పాలవుతున్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను స్థాపించి వారికి చికిత్స అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వయస్సు పైబడిన వారు బీపీ, షుగర్‌ లాంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు లక్షల్లో నిధులు కేటాయిస్తూ వారికి వైద్య సేవలు అందిస్తోంది. గ్రామీణులకు వైద్య సేవలు అందించేందుకు అల్లోపతి,  ఆయుర్వేదం, యునానీ ఆస్పత్రులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ఈ ఆసుపత్రులన్నీ ప్రారంభం నాటినుంచి అద్దె ఇళ్లల్లోనే కొనసాగుతున్నాయి. చాలా గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు ప్రభుత్వం సొంత భవనాలు నిర్మించినప్పటికీ ఆయుర్వేదం వవైద్యశాలపై శ్రద్ధ పెట్టడం లేదు. మొలంగూర్‌ గ్రామంలో 50 ఏళ్లుగా ఆయుర్వేద ఆసుపత్రి అద్దె ఇంట్లో కొనసాగుతోంది. ప్రారంభం మెుదట్లో ఈ ఆసుపత్రి కొన్నేళ్లు ప్రభుత్వ పాఠశాలలో కొనసాగింది. అనంతర అక్కడి సమస్యల కారణంగా అద్దె ఇంట్లోకి మారింది. దీర్ఘకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న రోగులకు చాలా మంది శాశ్వత చికిత్స కోసం ఈ ఆయుర్వేద ఆసుపత్రికి వస్తున్నారు. మండలంలోని  20 గ్రామాల ప్రజలు తరుచుగా ఇక్కడ వైద్య సేవలు పొందేందుకు వస్తున్నారు. అద్దె భవనంలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఆసుపత్రిని శంకరపట్నం మండల కేంద్రానికి తరలించాలని గతంలో కొంత మంది ప్రజాప్రతినిధులు కోరినప్పటికీ మొలంగూర్‌ ప్రజలు అభ్యంతరం మేరకు ఇక్కడే కొనసాగుతోంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఇప్పటికీ ఇక్కడ చికిత్స పొందుతున్నారు.  
     పలు వ్యాధులకు చికిత్స..
     బీపీ, షుగర్‌ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి  మొలంగూర్‌ ఆయుర్వేద ఆస్పత్రిలో పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందిస్తున్నారు. ప్రతి మంగళవారం నిర్వహించే గ్రామసందర్శనలో భాగంగా చాలా మంది రోగులు వచ్చి ఇక్కడ చికిత్స పొందుతూ ఉచితంగా మందులు తీసుకుంటున్నారు.  
    వినతులకే పరిమితం..
    జెడ్పీటీసీ సభ్యుడు సొంత గ్రామంలో ఆయుర్వేదవైద్యశాల భవనానికి  నిధులు మంజూరు చేయాలని పలు మార్లు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు వైద్యాధికారిణి వినతిపత్రాలు అందించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాం నుంచి ఇప్పటి వరకూ ప్రతి మండల సర్వసభ్య సమావేశాల్లో ఆయూర్వేద ఆసుపత్రికి పక్కా భవనం నిర్మించాలని వైద్యురాలు విన్నవిస్తునే ఉన్నారు. జిల్లాల విభజన జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అందిస్తున్న నిధుల నుంచి ఆయుర్వేద ఆస్పత్రికి నిధులు విడుదల చేయాలని వైద్యులు, సిబ్బంది, ప్రజలు కోరుతున్నారు. 
>
మరిన్ని వార్తలు