మెనూ తేడా ఉంటే చర్యలు: కలెక్టర్‌

18 Jul, 2016 17:48 IST|Sakshi
మెనూ తేడా ఉంటే చర్యలు: కలెక్టర్‌
శ్రీకాకుళం రూరల్‌: ప్రభుత్వ విద్యాలయాలు, గురుకులాల్లో మెనూ ఖచ్చితంగా అమలు చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని కలెక్టర్‌ డాక్టర్‌ పి. లక్ష్మీనృసింహం హెచ్చరించారు. మండలంలోని సింగుపురంలో ఉన్న కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని కలెక్టర్‌ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కిచెన్‌లోని ఆహార పదార్థాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. ఆహారం ఎలా పెడుతున్నారు, సరిపడా పెడుతున్నారా? లేదా? నాణ్యతగా ఉంటుందా? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. చదువుల కోసం కూడా ఆరా తీశారు. విద్యార్థినులు చెప్పిన సమాధానాలకు ఆయన సంతప్తి వ్యక్తం చేశారు. అనంతరం పెద్దపాడులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించారు. అక్కడ కూడా కిచెన్‌ను పరిశీలించారు. విద్యార్థులకు ప్రతి రోజు ఒక అరటి పండు పెడుతున్నట్టు విద్యార్థులు చెప్పారు. విద్యార్థులతో కలెక్టర్‌ మాట్లాడారు. ఆయనతో పాటు తహసీల్దార్‌ సనపల సుధాసాగర్, రెవెన్యూ పరిశీలకులు సంతోష్‌కుమార్, వీఆర్‌ఓ గణేష్‌ప్రసాద్, ఇన్‌చార్జి ఎస్‌ఓ వనజాక్షి తదితరులు ఉన్నారు. 
 
>
మరిన్ని వార్తలు