కిరోసిన్‌ పోసుకుని గృహిణి ఆత్మహత్య

30 Jul, 2016 00:17 IST|Sakshi

డిండి :  కిరోసిన్‌ పోసుకుని, నిప్పంటించుకుని గృహిణి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన శుక్రవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తి మండలం అంకూర్‌ గ్రామానికి చెందిన కరుణాకర్‌రెడ్డి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల (మోడల్‌ స్కూల్‌) ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. వృత్తిరీత్యా భార్య మాధవి (30)తో మండల కేంద్రంలో నివాసముంటున్నారు. ఏడాది నుంచి మాధవి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో భర్త కరుణాకర్‌రెడ్డి చికిత్స చేయిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం భర్త కరుణాకర్‌రెడ్డి పాఠశాల పని నిమిత్తం దేవరకొండకు వెళ్లాడు.  మాధవి కుమార్తె ఆరాధ్యను స్కూల్‌కు పంపించి తిరిగి ఇంటికి వచ్చిన అనంతరం ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. ఇంట్లో నుంచి పొగలు, మంటలు రావడంతో గమనించిన చుట్టు పక్కల వారు వచ్చి మంటలను ఆర్పారు. కానీ ఆ లోపే మాధవి శరీరం పూర్తిగా కాలిపోవడంతో మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు.  

మరిన్ని వార్తలు