మా పెళ్లికి దారేది?

1 Dec, 2016 01:15 IST|Sakshi
మా పెళ్లికి దారేది?

శుభలేఖ చూపించినా డబ్బు లేదంటున్న బ్యాంకర్లు
దాచుకున్న నగదు తీసుకునేందుకూ కష్టాలే
ఇలా అయితే వివాహం ఎలా చేసుకోవాలి అని ప్రశ్నిస్తున్న  వధూవరులు

తంబళ్లపల్లె: వారికి ఈనెల 9వ తేదీ వివాహం జరగాల్సి ఉంది. దానికోసం కూడబెట్టుకున్న డబ్బును పెద్దనోట్ల రద్దు కారణంగా బ్యాంకులో డిపాజిట్ చేశారు. విత్‌డ్రా విషయంలో రిజర్వ్ బ్యాంకు పెట్టిన ఆంక్షలతో అవసరానికి డబ్బు అందడం లేదు. వివాహ కార్యక్రమాలను ప్రత్యేకంగా తీసుకుని రూ.50వేల వరకు డ్రా చేసుకోవచ్చని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్ర స్థారుులో పరిస్థితి భిన్నంగా ఉంది. బ్యాంకులో డబ్బు లేదని, రూ.5వేలకు మించి ఇవ్వలేదని మేనేజర్ చెప్పడంతో ఏమి చేయాలో తోచక ఆందోళనకు గురవుతున్నారు.

మండలంలోని ఎర్రసానిపల్లె పంచాయతీ మూలపల్లెకు చెందిన రాధమ్మ కుమార్తె సి.మాధవికి, కోటకొండ పంచాయతీ మద్దిరాళ్లపల్లెకు చెందిన గాలి చిన్నరెడ్డెప్ప, నాగమణెమ్మ కుమారుడు గంగులప్పకు డిసెంబర్ 9వ తేదీన పెళ్లి జరిపించేందుకు పెద్దలు నిశ్చ రుుంచారు. బుధవారం వారు తంబళ్లపల్లె ఇండియన్ బ్యాంకుకు డబ్బు కోసం వచ్చారు. పెళ్లి పత్రిక చూపి బ్యాంకు మేనేజర్‌ను రూ.20వేలు ఇవ్వాలని కోరారు. రూ.5వేలు మాత్రమే ఇస్తామని చెప్పడంతో ‘పెళ్లి ఎలా చేసుకోవాలిరా దేవుడా’ అంటూ అక్కడి నుంచి వెనుదిరిగారు. ప్రభుత్వం దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు