విజయవాడ లో భారీ అగ్నిప్రమాదం

3 Feb, 2016 14:17 IST|Sakshi

 విజయవాడ రైల్వేస్టేషన్ సమీపంలోని రాజీవ్‌గాంధీ పూల మార్కెట్ వెనుక బస్తీలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో రమాదేవి అనే మహిళ సజీవ దహనమైంది. 150 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

భారీ ఆస్తి నష్టం జరిగింది. మధ్యాహ్నం అందరూ పనులకు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇళ్లలోని రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు శరవేగంగా ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి.


 150 కుటుంబాలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. ఇంట్లో ఉన్న రమాదేవి అనే మహిళ బయటికి రాలేక మంటల్లో సజీవ దహనమైంది. మంటలను చూయి స్థానికులు పరుగులు తీశారు. 3 అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను ఆర్పుతున్నాయి. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ముందస్తు చర్యగా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను ఆపేశారు.
ఇళ్లలోని అందరూ పనులకు వెళ్లిన సమయంలో ప్రమాదం జరగడంతో పెద్దగా ప్రాణనష్టం జరగలేదు. పిల్లలందరూ పాఠశాలలకు వెళ్లారు. యితే నిరుపేద కుటుంబాలవారు సర్వశ్వం కోల్పోయారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు