ఆర్థిక సంఘం నిధులు పారిశుధ్యానికే

3 Nov, 2016 22:43 IST|Sakshi
ఆర్థిక సంఘం నిధులు పారిశుధ్యానికే
  • జెడ్పీ సీఈఓ, డీపీఓ రామిరెడ్డి
  • ఇస్కపాళెం(బుచ్చిరెడ్డిపాళెం): కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 14వ ఆర్థిక సంఘం నిధుల్లో 75 శాతం పారిశుధ్యానికి, 25 శాతం మాత్రమే సీసీ రోడ్లకు ఉపయోగించాలని జెడ్పీ సీఈఓ , జిల్లా పంచాయతీ అధికారి రామిరెడ్డి అన్నారు. మండలంలోని ఇస్కపాళెం పంచాయతీని గురువారం ఆయన పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. సరిగా లేకపోవడంపై సక్రమంగా ఉంచాలని పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లుకు నోటీసు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో 110 పంచాయతీ కార్యాలయాలకు భవనాలు మంజూరయ్యాయన్నారు. ఒక్కొక్క దానికి రూ.15 లక్షలు నిధులు కేటాయించారని, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద పనులు జరుగుతాయన్నారు. జిల్లాలో 436 క్లస్టర్లకు గానూ 411 క్లస్టర్లకు పంచాయతీ కార్యదర్శులున్నారని, మిగతా 25 కార్యదర్శులు ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ఇస్కపాళెం పంచాయతీకి 14వ ఆర్థిక సంఘం కింద రూ.12 లక్షలు మంజూరయ్యాయని, అందులో రూ.3 లక్షలు విద్యుత్‌ బిల్లులు చెల్లించారన్నారు. 
    పాఠశాలల వద్ద చెత్త ఉంచొద్దు
    పంచాయతీ పరిధిలోని పల్లిపాళెం ప్రాథమిక పాఠశాల వద్ద చెత్త తిష్టవేయడంపై ప్రధానోపాధ్యాయుడు ఫిర్యాదు చేసినా పట్టించుకోని విషయాన్ని సీఈఓ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే తొలగించాలని సీఈఓ చెప్పారు. పాఠశాలల వద్ద చెత్త ఉంచొద్దని ఆయన ఎంపీడీఓ నరసింహారావుకు సూచించారు. నెలరోజుల్లో బుచ్చిరెడ్డిపాళెం పంచాయతీకి శాశ్వత కార్యదర్శిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ చిన్నమ్మ పాల్గొన్నారు. 
     
     
మరిన్ని వార్తలు