సోమశిలకు 29 వేల క్యూసెక్కులు

1 Sep, 2016 23:17 IST|Sakshi
సోమశిలకు 29 వేల క్యూసెక్కులు
సోమశిల: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాయలసీమలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సోమశిల జలాశయానికి గురువారం సాయంత్రానికి 29 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో జలాశయంలో నీటి మట్టం 11.3 టీఎంసీలకు చేరింది. నంద్యాల సమీపంలోని రాజోలుబండ ఆనకట్టవద్ద ఉదయం 22 వేల క్యూసెక్కులుగా ఉన్న వరద  సాయంత్రానికి 12 వేల క్యూసెక్కులకు తగ్గింది. పెన్నానది ప్రధాన హెడ్‌ రెగ్యులేటర్‌ అయిన వైఎస్సార్‌జిల్లా ఆదినిమ్మాయపల్లి వద్ద ఉదయం 32 వేల క్యూసెక్కులు వరద కొనసాగగా, రాత్రికి 19వేల క్యూసెక్కులుగా నమోదైంది. చెన్నూరు గేజ్‌వద్ద ఉదయం 35వేల క్యూసెక్కుల వరద ప్రవహిస్తుండగా, రాత్రికి 26వేల క్యూసెక్కులకు తగ్గుముఖం పట్టింది. సోమశిల జలాశయానికి ఉదయం 22వేల క్యూసెక్కుల వంతున కొనసాగిన వరద, మధ్యాహ్నం 27 వేల క్యూసెక్కులకు పెరిగింది. రాత్రికి 29వేల క్యూసెక్కుల వంతున ప్రవహిస్తోంది.  జలాశయంలో ఉదయం 10.01 టీఎంసీలుగా ఉన్న నీటిమట్టం రాత్రికి 11.321 టీఎంసీలకు చేరుకుంది. వరద ప్రవాహం కొనసాగితే నీటిమట్టం 15 టీఎంసీలకు చేరుకోవచ్చునని అధికారులు భావిస్తున్నారు. 
మరిన్ని వార్తలు