-

రూ.37 లక్షల ఎర్రచందనం స్వాధీనం

16 Jul, 2016 23:02 IST|Sakshi
రూ.37 లక్షల ఎర్రచందనం స్వాధీనం

చిత్తూరు : అక్రమంగా తరలిస్తున్న రూ.37 లక్షల విలువైన 31 ఎర్రచందనం దుంగలను శుక్రవారం స్వాధీనం చేసుకున్నట్టు అటవీ శాఖ, పోలీసు అధికారులు తెలిపారు. అలాగే ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశామన్నారు. టాటాఏస్ వాహనం, మినీ ట్రక్కును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

చిత్తూరు సీఐ వెంకటప్ప మాట్లాడుతూ చిత్తూరు నగరంలోని ఇరువారం కూడలి వద్ద వాహనాల తనిఖీ చేపట్టామన్నారు. తిరుపతి నుంచి వచ్చిన టాటా ఏస్ పరిశీలించగా మూడు ఎర్రచందంనం దుంగలను గుర్తించామని తెలిపారు. వాటిని తీసుకెళుతున్న విఎం.సెల్వం(40)ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. విచారణలో సేలంకు చెందిన చిత్తయ్య న్ ఆదేశాలతో తిరుపతి నుంచి ఎర్రచందనం దుంగల్ని తీసుకెళుతున్నట్లు అంగీకరించాడని తెలిపారు. వాహ నం, దుంగల విలు వ రూ.5 లక్షలు ఉంటుందన్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించామన్నారు. భాకరాపేట రేంజర్ రఘునాథ్ మాట్లాడుతూ తలకొన సెంట్రల్ బీట్ పరిదిలో కూంబింగ్ చేస్తుండగా ఎర్రావారిపాళెం వుండలం కూరపర్తివారిపల్లెకు చెందిన చెంగల్‌రెడ్డి ఎర్రచందనం దుంగలు తీసుకొస్తుండగా పట్టుకున్నావుని చెప్పారు.

విచారణలో మరోచోట రెండు దుంగలు ఉన్నట్లు చెప్పడంతో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నావుని వివరించారు. వాటి విలు వ రూ.2 లక్షలు ఉంటుందన్నారు. బంగారుపాళెం పోలీసులు మా ట్లాడుతూ కాణిపాకం బైపాస్ రోడ్డు లో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న వాహనం వస్తోందన్న సమాచారంతో నిఘా పెట్టామన్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా దుండగులు అశోక్ లైలాండ్ మినీ ట్రక్కును బంగారుపాళెం వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో ఆపి పారిపోయారని తెలిపారు. వాహనంలో పరిశీలించగా 25 ఎర్రచందనం దుంగలు ఉన్నట్టు గుర్తించామన్నారు. వాటిని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వీటి విలువ సమూరు రూ.30 లక్షలు ఉంటుందని వివరించారు.

మరిన్ని వార్తలు