‘ప్రకృతి’ ఉత్పత్తులకు విశేష ఆదరణ

27 Mar, 2017 21:51 IST|Sakshi
‘ప్రకృతి’ ఉత్పత్తులకు విశేష ఆదరణ
- నంద్యాల రైతు శిక్షణ కేంద్రం డీడీఏ సంధ్యారాణి
 
కర్నూలు(అగ్రికల్చర్‌): పురుగు మందులు, రసాయన ఎరువుల వాడకుండా.. ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటలకు విశేష ఆదరణ లభిస్తోందని నంద్యాల రైతు శిక్షణ కేంద్రం డీడీఏ సంధ్యారాణి, వ్యవసాయశాఖ డీడీఏ మల్లికార్జునరావు అన్నారు. నంద్యాల రైతు శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాల శిబిరాన్ని సోమవారం.. కర్నూలు సీక్యాంప్‌ రైతు బజార్‌లో వీరు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బండి ఆత్మకూరు, నంద్యాల, బనగానపల్లె, బేతంచెర్ల, వెలుగోడు మండలాల్లో 8 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 299 మంది రైతులు 350 హెక్టార్లలో ఈ వ్యవసాయం చేస్తున్నారన్నారు. ప్రదర్శనలో బియ్యం, జొన్నలు, జొన్నపిండి, కందిపప్పు, రాగులు, కొర్ర బియ్యం, నువ్వులు, పసుపుతో పాటు మామిడి కాయలు, పండ్ల, ఇతర కూరగాయలను విక్రయానికి ఉంచారు. వినియోగదారులు పోటీ వీటిని పడి కొనుగోలు చేశారు. మంగళవారం కూడా ప్రదర్శన ఉంటుంది. ఎన్‌పీఎం డీపీఎం నాగరాజు, నంద్యాల రైతు శిక్షణ కేంద్రం ఏడీఏ అరుణకుమారి, వ్యవసాయాధికారులు నాగసరోజ, నరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు