-

రూ.3వేల కోట్ల రెవెన్యూ లోటు: యనమల

1 Sep, 2016 15:04 IST|Sakshi

విజయవాడ : ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం రూ.లక్ష 47వేల కోట్ల అప్పుల్లో ఉందని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ ఈ ఏడాది రూ.24వేల కోట్ల వరకూ అప్పు చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ఆదాయం ఆశించినంతగా లేదని, రూ.3వేల కోట్లు రెవెన్యూ లోటుందన్నారు.

తాత్కాలిక రాజధానికి అనుకున్నదాని కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని యనమల తెలిపారు. రెవెన్యూ లోటు భర్తీ చేయాల్సి ఉందని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు. ఇక ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఊగిసలాడుతోందని యనమల తెలిపారు. త్వరలోనే దానిపై ప్రకటన వస్తుందన్నారు.

అలాగే స్విస్ ఛాలెంజ్ సీజ్ కవర్ గురించి తానేమీ మాట్లాడనని, ఆ అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. పట్టణాల్లో సమ్ల్ ఏరియాలు లేకుండా చేయాలని యోచిస్తున్నామన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఆశించినంతగా లేవన యనమల తెలిపారు.  ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల నుంచి అనుకున్నంత ఆదాయం రావడం లేదన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో జీఎస్టీ బిల్లుతో పాటు మరో రెండు బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు యనమల తెలిపారు.

మరిన్ని వార్తలు