శ్రీవారి హుండీల లెక్కింపులో కొత్త ఆదేశాలు

27 Apr, 2017 01:19 IST|Sakshi
ద్వారకా తిరుమల : శ్రీవారి దేవస్థానంలో బుధవారం నిర్వహించాలి్సన హుండీల లెక్కింపు కొత్త ఆదేశాల కారణంగా అర్ధంతరంగా నిలిచిపోయింది. దేవస్థానంలో పనిచేసే రెగ్యులర్‌ అటెండర్లు, డ్రైవర్లు, ఎన్‌ఎంఆర్‌లు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని హుండీల లెక్కింపునకు అనుమతించడం లేదని ఆలయ అధికారులు సర్క్యులర్‌ జారీచేశారు. ఆలయ చైర్మన్‌ ఎస్వీ సుధాకరరావు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు ఈ సర్క్యులర్‌ను నోటీసు బోర్డులో ఉంచారు. దీంతో దిగువస్థాయి సిబ్బంది కొరత కారణంగా హుండీల లెక్కింపు నిలిచిపోయింది. చినవెంకన్న ఆలయంలో ప్రతి 15–20 రోజులకోసారి జరిగే హుండీల లెక్కింపులో రెగ్యులర్‌ సిబ్బంది 65 మందితో పాటు, ఎన్‌ఎంఆర్, ఔట్‌సోరి్సంగ్‌ ఉద్యోగులు దాదాపు 100 మంది పాల్గొంటారు. దిగువస్థాయి సిబ్బంది అధికారుల పర్యవేక్షణలో పలు ప్రాంతాల్లో ఉన్న హుండీల్లోని సొమ్మును బయటకు తీసి, లెక్కింపు ప్రాంతానికి తరలిస్తారు. అక్కడ మిగిలిన సిబ్బంది, అధికారులు లెక్కిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరూ శ్రమిస్తేనే ఈ లెక్కింపు పూర్తవుతుంది. అయితే బుధవారం హుండీల లెక్కింపు జరిపేందుకు ఆలయ అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ఇంతలో ఎగువస్థాయి సిబ్బంది, అధికారులతో మాత్రమే లెక్కింపు జరపమన్న ఆదేశాలు జారీ అయ్యాయి.
 
సొమ్ము బయటకు తీసేవారు లేక 
హుండీల లెక్కింపు జరిపేందుకు సుమారు 30 మంది అధికారులు, ఎగువస్థాయి సిబ్బంది ఉదయం లెక్కింపు ప్రాంతానికి చేరుకున్నారు. అయితే హుండీల్లోని సొమ్ము బయటకు తీసే వారు లేక, తీసినా సకాలంలో లెక్కింపు పూర్తవదన్న సందేహంతో అధికారులు లెక్కింపును నిలిపివేశారు. సీసీ కెమేరాల పర్యవేక్షణలో జరిగే హుండీల లెక్కింపునకు అనుమతించని దిగువస్థాయి సిబ్బందిని, ఏ పర్యవేక్షణా లేని, ఆదాయాలు వచ్చే ప్రాంతాల్లో విధులు ఎలా కేటాయిస్తున్నారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మరింత కట్టుదిట్టమైన భద్రతల నడుమ లెక్కింపు జరపాల్సింది పోయి, ఇలా దిగువస్థాయి సిబ్బందికి లెక్కింపులో మినహాయింపు ఇవ్వడం ఏమిటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
 
మరిన్ని వార్తలు