ముగ్గురు వన్యప్రాణి వేటగాళ్ల అరెస్ట్‌

30 Jul, 2016 23:43 IST|Sakshi
సైదాపూర్‌ : వన్యప్రాణులను వేటాడేందుకు నాటు బాంబులు తీసుకెళ్తున్న ముగ్గురిని పోలీసులు శనివారం సాయంత్రం పట్టుకున్నారు. ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం.. ఆకునూర్‌ గ్రామానికి చెందిన బాషవేని కొమురయ్య, తూటి సమ్మయ్య, బాషవేని రాజయ్య కొన్నిరోజులుగా వన్యప్రాణులను నాటు బాంబులతో వేటాడుతున్నారు. వీరికి హన్మకొండకు చెందిన సురేందర్‌ నాటు బాంబులు సరఫరా చేస్తున్నాడు. శనివారం జంతువుల రక్తం పూసిన నాటుబాంబులు తీసుకుని ద్విచక్రవాహనంపై ఎగ్లాస్‌పూర్‌ గుట్టల్లోకి బయల్దేరారు. సోమారం చౌరస్తా వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు వీరిని ఆపి తనిఖీ చేశారు. నాటు బాంబులు దొరకడంతో అదుపులోకి తీసుకున్నట్లు ఎసై ్స రవి తెలిపారు. నిందితుల నుంచి 42 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. బాషవేని కొమురయ్య, తూటి సమ్మయ్య, బాషవేని రాజయ్యతోపాటు నాటు బాంబులు సరఫరా చేసిన సురేందర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎసై ్స చెప్పారు. ముగ్గురిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. 
 
 
మరిన్ని వార్తలు