భార్యపై కత్తితో దాడి.. భర్త పరారీ

16 Dec, 2015 09:38 IST|Sakshi

కాకినాడ: కట్టుకున్న భార్యపై విచక్షణ లేకుండా కత్తితో దాడిచేశాడో భర్త. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో ఏతిమొగ ప్రాంతంలో బుధవారం వెలుగుచూసింది. కత్తితో దాడి చేయడంతో భార్య మరియమ్మ కోమాలోకి వెళ్లింది.

దాడిచేసిన అనంతరం భర్త అక్కడినుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు ఆమెను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు