భార్య ఒంటికి నిప్పుపెట్టిన భర్త

1 Jan, 2017 23:34 IST|Sakshi

మిడుతూరు: మండలపరిధిలోని చౌట్కూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కట్టుకున్న భార్యనే కడతేర్చేందుకు ప్రయత్నించాడు.స్థానికుల కథనం మేరకు .. గ్రామానికి చెందిన వడ్డె శ్రీనివాసులు ఆదివారం ఫుల్‌గా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో అడిగిన వెంటనే అన్నం పెట్టలేదనే కారణంతో భార్య రాజేశ్వరి ఒంటిపై కిరోసిన్‌ పోసి నిప్పు పెట్టాడు. మంటలకు తట్టుకోలేక ఆమె ఇంటి నుంచి బయటకు పరుగులు తీయడంతో సమీప బంధువులు, ఇరుగుపొరుగు వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. బాధితురాలిని  చికిత్స నిమిత్తం 108లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఏడాది వయసున్న పాప ఉంది. ఇందుకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.  

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు