బాలకృష్ణతో 101వ సినిమా చేస్తా

5 Mar, 2016 09:23 IST|Sakshi
బాలకృష్ణతో 101వ సినిమా చేస్తా

కాకినాడ : యువరత్న నందమూరి బాలకృష్ణతో 101వ సినిమా తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని దర్శకుడు వక్కపట్ల సూర్య వెంకట సత్యనారాయణమూర్తి (సత్యదేవా) తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని తన స్వగ్రామమైన పినపళ్లలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇప్పటికే బాలకృష్ణతో తీసిన ‘లయన్’ సినిమా నిర్మాతకు మంచి లాభాలు తెచ్చిపెట్టిందని, టేకింగ్‌పరంగా తనకు మంచి గుర్తింపు తెచ్చిందని అన్నారు.
 
ప్రస్తుతం బాలకృష్ణ 100వ చిత్రంగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తరువాత తన సినిమా ఉంటుందన్నారు. అలాగే ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు నిర్మాతగా పవన్ కళ్యాణ్ హీరోగా తీసే సినిమాకు కథా చర్చలు తుది దశకు చేరుకున్నాయన్నారు. పుష్కరకాలం క్రితం దర్శకరత్న దాసరికి పరిచయం చేసి, తనకు సినీ జీవితాన్నిచ్చిన మాజీ మంత్రి సంగిత వెంకటరెడ్డి తనకు గురుతుల్యులన్నారు. దర్శకుడు సత్యదేవాతో ఫొటోలు తీయించుకునేందుకు పలువురు పోటీ పడ్డారు.

>
మరిన్ని వార్తలు