అమ్మ పాత్రలు నటించడం చాలా ఇష్టం

24 Jan, 2017 23:23 IST|Sakshi
అమ్మ పాత్రలు నటించడం చాలా ఇష్టం
భీమవరం(ప్రకాశం చౌక్‌) :  సినిమా, టీవీ సీరియల్‌ నటి శ్రీమాధవి(స్వాతి చినుకులు సీరియల్, రాజన్న సినిమా ఫేమ్‌) మంగళవారం భీమవరంలోని మావుళ్లమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఓ సీరియల్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆమె విలేకరులతో మాట్లాడారు. తాను ఇప్పటి వరకు 20 సినిమాల్లో నటించానని, పలు సీరియళ్లలో నటిస్తున్నానని చెప్పారు. నాగార్జున రాజన్న, ఒక్కడున్నాడు సిమాల్లో మంచి పాత్రల్లో నటించినట్టు చెప్పారు. సీరియల్స్‌ విషయానికి వస్తే తాను నటించిన స్వాతి చినుకులు, అగ్నిపూలు, బొమ్మరిల్లు ప్రస్తుతం ప్రసారం అవుతున్నాయన్నారు. సీరియల్స్‌ల్లో తాను చేస్తున్న అమ్మపాత్రలు అంటే చాలా ఇష్టం అని అన్నారు. తన కుమార్తె ప్రియాంక ద్వారా టీవీ  రంగంలోకి వచ్చినట్టు తెలిపారు. అమ్మ పాత్రల్లో మరింత బాగా నటించి మంచి నటిగా పేరు తెచ్చుకోవాలన్నదే తన లక్ష్యం అన్నారు.
మరిన్ని వార్తలు