బదిలీల కుదుపు..?

11 Apr, 2017 00:17 IST|Sakshi
  • జిల్లా కలెక్టర్‌ అరుణ్‌కుమార్, జేసీకి కూడా
  • వీరి స్థానంలో తిరుపతి నుంచి వినయ్‌చందా..
  • ఎన్నికల టీమ్‌ కోసం ‘బాబు’ కసరత్తు
  • సాక్షి ప్రతిని«ధి, కాకినాడ :
    రెండేళ్లలో రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం జిల్లా పరిపాలనపై పట్టు సాధించేందుకు చంద్రబాబు సొంత టీమ్‌ను ఏర్పాటు చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా రా ష్ట్రంలో పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరి కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్లను మార్పు చేయాలనే నిర్ణయానికి వచ్చా రు. రాష్ట్రంలో పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసేం దుకు సీఎం కసరత్తు చేస్తున్నారని జిల్లా కలెక్టరేట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఎవరిని ఏ జిల్లాకు బదిలీ చేయాలనే అంశంపై రూ పొందించిన జాబితాలో జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ కుమార్, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ పేర్లు ఉన్నాయని జిల్లా కేంద్రానికి అందిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌ ఇద్దరు ప్రమోటీ ఐఏఎస్‌లే. ఈ కారణంగా ఈ సారి బదిలీల్లో ప్రమోటీలకు కాకుండా డైరెక్ట్‌ ఐఏఎస్‌లనే ఇక్కడ నియమించాలనే ఆలోచనతో ఉన్నారని తెలిసింది. కలెక్టర్, జేసీ ఇద్దరూ జిల్లాకు వచ్చి రెండేళ్లు దాటిపోయింది. ఈ క్రమంలో ఇద్దరికీ బదిలీ తప్పదంటున్నారు. అయితే జాయింట్‌ కలెక్టర్‌ సత్యనారాయణ కలెక్టర్‌గా పదోన్నతి పొందనుండటంతో ఏదో ఒక జిల్లాకు కలెక్టర్‌గా బదిలీ అవుతారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కలెక్టర్, జేసీ ఇద్దరినీ ఒకేసారి బదిలీచేస్తే జిల్లా పరిపాలనా వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తే జేసీ బదిలీకి మరికొంత సమయం పడుతుంది. లేదంటే ఇద్దరూ బదిలీ ఖాయమనే అంటున్నారు.
    గతంలో కూడా బదిలీ ఊపు...
    కలెక్టర్‌ అరుణ్‌ కుమార్‌ బదిలీపై జిల్లా యంత్రాంగంలో ఆసక్తితోపాటు ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఒకే జిల్లాలో రెండేళ్లు పనిచేసిన కలెక్టర్‌ ఎవరినైనా సహజంగానే మరో జిల్లాకు బదిలీ చేస్తుంటారు. అందులో భాగంగా గతంలో రెండు పర్యాయాలు కలెక్టర్‌ బదిలీ అవుతారని ప్రచారం జరిగినప్పటికీ చివరి నిమిషంలో బదిలీ నిలిచిపోయిందనే వారు. క¯ŒSఫర్మ్‌డ్‌ ఐఏఎస్‌ అయిన అరుణ్‌ కుమార్‌కు కలెక్టర్‌గా జిల్లా తొలి పోస్టింగ్‌. గతంలో ఇదే జిల్లాలో ఆర్డీఓ, బీసీ కార్పొరేష¯ŒS ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేష¯ŒS కమిషనర్‌గా పని చేశారు. 2015 జనవరి నెలలో జిల్లాకు వచ్చిన అరుణ్‌ కుమార్‌ రెండు సంవత్సరాలు పైబడే ఇక్కడి జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
    పుష్కర తొక్కిసలాటతో వాయిదా...
    అరుణ్‌కుమార్‌ బదిలీపై గత ఏడాది ఇదేరకంగా విస్తృతమైన ప్రచారం జరిగింది. అయినప్పటికీ ఆయన బదిలీ జరగ లేదు. పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరంలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఆ సంఘటన జరిగినప్పుడు జిల్లా కలెక్టర్‌గా అరుణ్‌కుమార్‌ ఇక్కడే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సీఎం, కుటుంబ సభ్యులు వీఐపీ ఘాట్‌లో కాకుండా సా«ధారణ యాత్రికులు స్నానమాచరించే ఘాట్‌లో ఉండటం, తరలివచ్చిన జనంతో సీఎం పూజలు చేసే ప్రక్రియను ఘనంగా చిత్రీకరించి అంతర్జాతీయ మీడియా ద్వారా విస్తృతమైన ప్రచారం పొందాలనే అత్యుత్సాహమే తొక్కిసలాటకు దారితీసిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ప్రభుత్వం ఏకసభ్య కమిష¯ŒSను విచారణకు ఆదేశించింది. ఆ కమిష¯ŒS విచారణ గడువు పొడిగిస్తూ పోతున్నారు తప్పించి ఇప్పటికీ  కొలిక్కి రాలేదు. కేవలం ఈ కారణాలతోనే జిల్లా కలెక్టర్‌ బదిలీ రెండు పర్యాయాలు నిలిచిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఈసారి బదిలీల జాబితాలో అరుణ్‌కుమార్‌ పేరు ఖాయమైందని కలెక్టరేట్‌ వర్గాల సమాచారం.
    రాజమహేంద్రవరం కార్పొరేష¯ŒS
    కమిషనర్‌కు పదోన్నతితో...
    తొలి విడతలో కలెక్టర్, జేసీలకు బదిలీలుంటాయంటున్నారు. ఈ మేరకు ఒకటి, రెండు రోజుల్లో జాబితా ఖరారు కానుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. రెండో విడత బదిలీల్లో రాజమహేంద్రవరం కార్పొరేష¯ŒS కమిషనర్‌ వేగేశ్న విజయరామరాజు, సబ్‌ కలెక్టర్‌ విజయ్‌కృష్ణ¯ŒS జాయింట్‌ కలెక్టర్‌లుగా పదోన్నతి ఇవ్వాల్సి ఉంటుందంటున్నారు. ఆ క్రమంలోనే మలి విడత బదిలీల జాబితాలో వీరిద్దరికీ కూడా బదిలీ ఉంటుందంటున్నారు.
     
    తిరుపతి మున్సిపల్‌ కార్పొరేష¯ŒS కమిషనర్‌కు అవకాశం...?
    బదిలీ అయ్యే అరుణ్‌కుమార్‌ సెర్‌్ఫకు తిరిగి వెళ్లే ఆలోచనతో ఉన్నారంటున్నారు. ఈసారి డైరెక్ట్‌ ఐఏఎస్‌లను మాత్రమే జిల్లా కలెక్టర్లుగా నియమించాలని సీఎం నిర్ణయించిన నేపథ్యంలో పలువురు జిల్లా కలెక్టర్‌గా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అధికార వర్గాల ద్వారా తెలియవచ్చింది. బదిలీపై రావాలనుకుంటున్న వారి జాబితాలో తిరుపతి మున్సిపల్‌ కార్పొరేష¯ŒS కమిషనర్‌ వాడ్రేవు వినయ్‌చంద్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వినయ్‌చంద్‌తోపాటు టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు కూడా జిల్లాకు రావడానికి గత కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. వీరిద్దరిలో వినయ్‌చంద్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. వీరితోపాటు వుడా వీసీ టి. బాబూరావు నాయుడు, సీఎంఓ కార్యాలయంలో ఉన్న ప్రద్యుమ్న పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.
     
>
మరిన్ని వార్తలు