ప్రశాంతంగా ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష

10 Jul, 2016 15:29 IST|Sakshi

-225మంది 198 హాజర్, 27 మంది గైర్హాజర్

పెద్దేముల్ (రంగారెడ్డి జిల్లా)

పెద్దేముల్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలల్లో అదివారం జరిగిన ఆదర్శపాఠశాల(మెడల్ స్కూల్) ప్రవేశ పరీక్ష ప్రశాతంగా ముగిసింది. మొత్తం 225 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోగా 198మంది పరీక్షకు హాజరైనట్ల్లు మోడల్ స్కూల్ ప్రిన్సిఫాల్ రాఘవేందర్ తెలిపారు. 6వ తరగతిలో 99మందికి 88మంది,7వ తరగతిలో 66మందికి 58మంది,8వ తరగతిలో 62కు 52మంది విద్యార్థులు ప్రవేశ పరిక్ష రాసినట్లు చీఫ్ సూపరింటెండెంట్ శాంతప్ప చెప్పారు. ఉదయం 9గంటల నుండే విద్యార్థులు పరీక్ష కేంద్రం వద్ద బారులు తీరారు.

 

మరిన్ని వార్తలు