డైలమా..!

17 Jun, 2016 02:03 IST|Sakshi
డైలమా..!

గుర్తింపు’ ఎన్నికలపై సందిగ్ధత
29తో ముగియనున్న టీబీజీకేఎస్ కాలపరిమితి
ప్రక్రియ మొదలు పెట్టని ఆర్‌ఎల్‌సీ
సింగరేణిలో ఆరో దఫా ఎన్నికలూ ఆలస్యమేనా?

 
 
మంచిర్యాల సిటీ(ఆదిలాబాద్) : సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఇప్పటి వరకు కాల పరిమితి ప్రకారం జరిగిన దాఖలాలు లేవు. కంపెనీలో ఐదు దఫాలుగా నిర్వహించిన ఎన్నికలు మూడు నుంచి పది నెలల జాప్యంతో జరిగారుు. ప్రస్తుతం ఆరో దఫా ఎన్నికలు సైతం సకాలంలో జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. ఇందుకు ప్రధానంగా ప్రస్తుత గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌లో నెలకొన్న అనిశ్చితి కారణం కావడంతో శ్రేణుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది.


 మిగిలింది 13 రోజులే..
 సింగరేణిలో ఐదో దఫా ఎన్నికలు 2012 జూన్ 28న జరిగారుు. గెలుపొందిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి మాత్రం ఆగస్టు 6న అధికారికంగా ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. వాస్తవం గా ఎన్నిక ఫలితం తేదీ ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ లెక్కన ఈనెల 29వ తేదీ తో టీబీజీకేఎస్ కాలపరిమితి ముగుస్తుంది. రెండు నెలల ముందు నుంచే ఆర్‌ఎల్‌సీ ఎన్నిక ల ప్రక్రియ ప్రారంభించాల్సి ఉండగా అలాంటిదేమీ చేపట్టలేదు. యూజమాన్యం సైతం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.


 ఆది నుంచీ ఆధిపత్య పోరు
 రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్ సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలుపొందిన నాటి నుంచి యూనియన్‌లో పదవుల కోసం నాయకుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. మాతృ సంస్థ సైతం పెద్దగా పట్టించుకోకపోవడంతో చినికి చినికి గాలివానలా మారింది. ఈ క్రమంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను పట్టించుకునే వారు లేకపోవడంతో కార్మికులకు కష్టాలు తప్పడం లేదు. నాలుగేళ్ల పుణ్యకాలం కాస్త ముగిసే సమయం వచ్చినా యూని యన్ గాడిలో పడలేదు. ఎక్కడి సమస్యలు అక్క డే ఉన్నారుు. బొగ్గు బిడ్డలకు తెలంగాణ ఇంక్రిమెంట్ తప్ప చేసిన మేలు చెప్పుకోవడానికి ఏమీ లేదు. వారసత్వ ఉద్యోగాల హామీ అలాగే ఉంది. సొంతింటి కల నెరవేర్చలేదు. ఆదాయపు పన్ను మినహారుుంపు ఊసే లేదు.

ఇక సకల జనుల సమ్మె కాలపు వేతనంపై స్పష్టత లేదు. ఈ విషయూలపై ఇప్పటికే అవకాశం దొరి కిన ప్రతీసారి ఇతర కార్మిక సంఘాలన్నీ దుమ్మె త్తి పోస్తున్నారుు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు వెళితే కార్మికులకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఫలితాలు ఎలా ఉంటాయోనని అధిష్టానం ఆచి తూచి అడుగులు వేస్తోంది.


ఎత్తుగడ కలిసొచ్చేనా..?    
టీబీజీకేఎస్‌లోని అంతర్గత పోరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. సమస్య పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేయకపోవడంతో పరిస్థితి ఇంతవరకు వచ్చిందని రాజకీయ పరిశీ లకులు అంటున్నారు. తీరా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ‘నూతన కమిటీ’ వేస్తామని చెప్పినా ఇంకా కొలిక్కి రాలే దు. ఎన్నికలు జరిగిన తేదీని బట్టి చూస్తే జూన్ 29 తర్వాత ఆరో దఫా ఎన్నికలు నిర్వహించాలి. ఈనేపథ్యంలో అధికారికంగా ధ్రువీకరణ పత్రం ఇచ్చిన తేదీ.. ఎన్నికలు జరిగిన తేదీకి మధ్య ఉన్న 38 రోజుల సమయూన్ని యూనియన్‌లోని పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి వినియోగించుకోవాలని అధినాయకత్వం చూస్తోంది. అం దులో భాగంగానే ‘ఆగస్టు 6వ తేదీ వరకు తమ కు హోదా వర్తిస్తుంది కాబట్టి.. ఆ సమయానికే ఎన్నికలు జరపాలని వాదిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే పరిస్థితి ఏమిటని శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.


 ఆలస్యమైతే ఉత్పత్తికి నష్టం
 ఎన్నికలు ఆలస్యమైతే ఉత్పత్తికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఉత్పత్తి మందకొడిగా సాగుతోంది. గడిచిన రెండు నెల ల్లో ఒకటి రెండు ఏరియూలు మినహా నూరు శా తం ఉత్పత్తి నమోదు కాలేదు. పైగా ఎన్నికలను సాగదీస్తే ప్రచారం, గేట్ మీటింగ్‌ల ప్రభావం ఉత్పత్తిపై పడుతుంది. అందుకే తొందరగా ఎన్నికలు ముగించాలని యూజమాన్యం భావి స్తున్నా అధికార పక్షం అడ్డుపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు మొదటి వారంలోపు ఎన్నికలు ముగించితే వార్షిక లక్ష్యాన్ని సులువుగా కార్మికులపై భారం పడకుండా సాధించవచ్చని కంపెనీ ఆలోచిస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది.
 

మరిన్ని వార్తలు