ప్రభుత్వం స్పందించకుంటే మందులు కొనిస్తా..

4 Oct, 2016 00:12 IST|Sakshi
ప్రభుత్వం స్పందించకుంటే మందులు కొనిస్తా..

–మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
–జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి ఆకస్మికSతనిఖీ
–ఆస్పత్రిలోని పరిస్థితులను ఆరోగ్యశాఖ మంత్రికి ఫోన్‌లో వివరించిన కోమటిరెడ్డి
నల్లగొండ టౌన్‌ : జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిని సోమవారం మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీని చేశారు. ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ, కాన్పుల వార్డులు, మరుగుదొడ్లను పరిశీలించారు. అక్కడి పరిస్థితులు చూసి ఆయన చలించిపోయారు. ఎమెర్జెన్నీ వార్డులో ఏసీలు, ఫ్యాన్లు పనిచేయకపోవడాన్ని గమనించిన ఆయన ఆస్పత్రి సూపరింటెండెండ్‌ను ఎందుకు పనిచేయడం లేదని ప్రశ్నించారు. రిపేర్‌ చేయించాలంటే జిల్లా కలెక్టర్‌ అనుమతిని తీసుకోవాలని, అభివృద్ధి కమిటీ సమావేశంలో తీర్మానం చేయాలని సమాధానం చెప్పారు. దీంతో కోమటిరెడ్డి మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రి అభివృద్ధి నిధులు రూ.5 కోట్లు మూలుగుతున్నా పట్టించుకోవడం లేదు. మందులు బయటనుంచి తెప్పిస్తున్నారు. కనీసం బెడ్‌షీట్లు కూడా కొనలేకపోతున్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని తన ఆసహనాన్ని వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్‌ లక్ష్మారెడ్డికి ఫోన్‌ చేశారు. అన్నా..నేను కోమటిరెడ్డి Ðð ంకట్‌రెడ్డిని మాట్లాడుతున్నా.. నల్లగొండలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నా.. మీరు వింటానంటే కొన్ని నగ్నసత్యాలు చెబుతా అంటూ ఆస్పత్రి పరిస్థితులను వివరించారు. కనీసం ఎమర్జెన్సీ వార్డులో ఏసీలు, ఫ్యాన్లు లేకపోతే ఎట్లాగన్నా.. వారంలో మీరు స్పందించకుంటే నేనే మందులను, బెడ్‌షీట్లను కొనిస్తానని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
కాన్పుల వార్డులో ఏమిటీ దుస్థితి..
అనంతరం ఆయన కాన్పుల వార్డులకు చేరుకుని అక్కడ నేలపై చిన్నారులను పక్కన పడుకోబెట్టుకుని నిద్రిస్తున్న మహిళలను చూసి ఇదేమి దారుణ పరిస్థితి అని వాపోయారు. ఏమిటీ దుస్థితి, ఉదయమే కాన్పు అయిన వారిని ఇలానే నేలపై పడుకోబెడతారా అని అసహనాన్ని వ్యక్తం చేశారు. వార్డులో ఫ్యాన్లు తిరగడంలేదని, ట్యూబులు వెలగడం లేదని పలువురు మహిళలు కోమటిరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఫ్యాన్లను, ట్యూబులను ఏర్పాటుకు రూ.6 వేలను సంబంధిత ఏఈకి అందజేశారు. అలాగే నార్కట్‌పల్లి మండలానికి చెందిన ఓ మహిళ రూ.10 వేలు అందజేసి హైదరాబాద్‌ చికిత్స పొందుతున్న ఆమె బాబుకు ఆ ఆస్పత్రిలో డబ్బులను కట్టాల్సిన అవసరం లేదని, వారితో నేను మాట్లాడుతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరిం టెండెంట్‌ డాక్టర్‌ టి.నర్సింగరావు, ఆర్‌ఏఓ డాక్టర్‌ ఉదయ్‌సింగ్, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వంగూరు లక్ష్మయ్య, పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ పాశం సంపత్‌రెడ్డి, అల్లి సుభాస్‌యాదవ్, సట్టు శంకర్, డోకూరి రమేష్‌ పాల్గొన్నారు.

 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు