శ్రమ, పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలకు

12 Sep, 2016 22:26 IST|Sakshi
శ్రమ, పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలకు
  • హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి బి.చంద్రకుమార్
  • జనగామ : విద్యార్థులు తమ లక్ష్యాలను అధిగమించేందుకు శ్రమ, పట్టుదలతో కృషి చేయాలని హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి బి.చంద్రకుమార్‌ అన్నారు. పట్టణంలోని సాహితీ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన​ప్రేషర్స్‌ డే వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్‌ కరై కుమార్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని చంద్రకుమార్ ప్రారంభించారు. కష్టపడితే ఉన్నత శిఖరాలకు ఎలా వెళ్లాలో తనను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు.
     
    ప్రభుత్వాల నుంచి దేశంలో పారిశ్రామికవేత్తలు తీసుకున్న వేల కోట్ల రూపాయల రుణాలను రాబట్టుకోగలితే కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అందించవచ్చన్నారు. కానీ, ప్రభుత్వాల అసమర్థత కారణంతో పారిశ్రామిక వేత్తలు వేల కోట్ల రూపాయల రుణాలను చెల్లించడం లేదన్నారు. జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా కన్న తల్లిదండ్రులు, విద్యాబుద్దులు నేర్పిన గురువులను మరిచిపోవద్దని సూచించారు. అంతకుముందు విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం చంద్రకుమార్‌ను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు ఆకుల నర్సింహులు, అధ్యాపకులు ఉపేందర్‌, రత్నాకర్‌, భాస్కర్‌, సతీష్‌, మహేష్‌, రాజు, భాస్కర్‌, రాంబాబు, రామచంద్రం, రాజకొంమురయ్య, దివ్య, చైతన్య, శ్వేత, శ్రీకాంత్‌ ఉన్నారు.
    12జెజిఎన్‌05 :  చంద్రకుమార్‌ను సత్కరిస్తున్న యాజమాన్యం
     
మరిన్ని వార్తలు