రుణమాఫీ అందకపొతే అసెంబ్లీ ముట్టడే

28 Jul, 2016 21:07 IST|Sakshi
రుణమాఫీ అందకపొతే అసెంబ్లీ ముట్టడే

డీసీసీబీ మాజీ చైర్మన్‌ లక్ష్మారెడ్డి
పెద్దేముల్: ప్రతి రైతుకు రుణమాఫీ అందకపొతే అసెంబ్లీని ముట్టడిస్తామని డీసీసీబీ మాజీ చైర్మన్‌ లక్ష్మారెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు నరేష్‌మహరాజ్‌ అన్నారు. పెద్దేముల్ ఎంపీడీఓ కార్యాలయాన్ని గురువారం ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అంటూ మోసం చేస్తుందన్నారు. తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్‌, పెద్దేముల్, తాండూరు మండలాలకు చెందిన రైతులకు సుమారు రూ.13 కోట్ల పంట రుణాలు రావలసి ఉందన్నారు. ఈ విషయమై తాండూరు నియోజక వర్గంలో పెద్దఎత్తున ధర్నా కూడా చేశామని గుర్తు చేశారు. బంగారు తెలంగాణ అంటూ రైతులను నిలువునా మోసం చేస్తుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. కేవలం పెద్దేముల్ మండలంలోని హన్మాపూర్‌, ఇందూరు, గార్మీపూర్‌తోపాటు పలు గ్రామాల్లో సుమారు 1,600 మంది రైతులకు రూ.9 కోట్లపై పంట రుణమాఫీ రావలసి ఉందని వారు తెలిపారు. రుణమాఫీ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయకపొతే కలెక్టర్‌తోపాటు అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు. కార్యక్రమంలో పెద్దేముల్‌ రైతు సేవాసహకార సంఘం చైర్మన్‌ ధారాసింగ్‌, కాంగ్రెస్‌ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గోన్నారు.
 

>
మరిన్ని వార్తలు