నమ్మితే.. నట్టేట ముంచారు!

7 Aug, 2016 00:34 IST|Sakshi
నమ్మితే.. నట్టేట ముంచారు!
నమ్మితే.. నట్టేట ముంచారు!
మల్లికేతి (డీ.హీరేహాళ్‌): ప్రకృతి వైపరీత్యాలే కాదు ఫర్టిలైజర్‌ షాపుల నిర్వాహకులు కూడా  రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు. మేలైన విత్తనాలని, గణనీయమైన దిగుబడి వస్తుందని నాణ్యత లేని విత్తనాలు అంటగడుతున్నారు. వ్యాపారుల మాటలు నమ్మి భారీ పెట్టుబడులు పెట్టి సాగు చేసిన తర్వాత రైతులు నిండా మునిగిపోతున్నారు. మల్లికేతి గ్రామానికి చెందిన రైతులు అప్పణ్ణరెడ్డి, మల్లికార్జున, విరుపాక్షి తదితర రైతులు బళ్లారిలోని ప్రియ ఏజెన్సీలో ఎన్‌కే 6668 రకం మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేశారు. ఎకరాకు రూ.15వేల నుంచి రూ.18వేల దాకా పెట్టుబడి పెట్టి పంట సాగు చేశారు. మూడు నెలలు అవుతున్నా కండె (కంకి) రాకపోవడంతో అనుమానం వచ్చింది. మండల వ్యవసాయాధికారి నిర్మల్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లి తమ గోడు వెల్లబోసుకున్నారు. ఆయన పంటలను పరిశీలించగా.. నాసిరకం విత్తనం వల్లే పంట దిగుబడి రాలేదని తేల్చారు. తమకు పరిహారం ఇప్పించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరగా... బళ్లారిలో విత్తనం కొనుగోలు చేసినందున తామేమీ చేయలేమన్నారు. వినియోగదారుల ఫోరంను ఆశ్రయించి, కంపెనీపై కేసు నమోదు చేయించి పరిహారం పొందవచ్చని సూచించారు.  
మరిన్ని వార్తలు